RBI: ప్రభుత్వ బ్యాంకుల్లో క్లైమ్ చేయని డబ్బు ఎంతో తెలుసా.. అక్షరాల రూ.35 వేల కోట్లు..
చాలా మంది బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన వారు నామినీ యాడ్ చేయకపోయినా.. లేదా వారికి ఎవరు లేకపోయినా.. లేదా వారు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసి ఎవరికీ చెప్పకపోయినా ఆ డబ్బులు బ్యాంకులోనే ఉండిపోతాయి. ఇలా ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఎవరూ క్లైమ్ చేయని డిపాజిట్లు భారీగా పేరుకుపోయాయి. 2023 ఫిబ్రవరి నాటికి క్లైమ్ చేయని డిపాజిట్లు దాదాపు రూ.35 వేల కోట్లు ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్నాయి.
ఈ డిపాజిట్లు గత పది ఏళ్లుగా లేదా అంతకంటే ఎక్కువ కాలం నిర్వహణ లేని దాదాపు 10.24 కోట్ల ఖాతాల్లో ఉన్నాయి. ఇలా క్లైమ్ చేయని డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్‌కి ట్రాన్స్ ఫర్ చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం నిర్వహణలేని ఖాతాల్లోని రూ.35,012 కోట్లను ప్రభుత్వ బ్యాంకులు ఆర్బీఐకి బదిలీ చేసినట్లు లోక్ సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.













Click it and Unblock the Notifications