వార్నింగ్: జన్‌ధన్ ఖాతాల్లో రూ.37 వేల కోట్లు జమ
ప్రభుత్వం హెచ్చరించిన తర్వాత జన్‌ధన్ ఖాతాల్లో జమ చేసే డబ్బు తగ్గిపోయింది. ఇప్పటి వరకు జన్ ధన్ ఖాతాల్లో పెద్ద యెత్తునే నగదు జమ అయింది.
న్యూఢిల్లీ: నల్లడబ్బును తెలుపు చేయడానికి ప్రజలు తమ ఖాతాలను దుర్వినియోగం చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించిన తర్వాత జన్‌ధన్ ఖాతాల్లో జమయ్యే నగదు మొత్తాలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం బుధవారం ఆ విషయాన్ని చెప్పింది.
నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత జన్‌ధన్ ఖాతాల్లోకి నగదు పెద్ద యెత్తున ప్రవహిస్తూ వచ్చింది. ఖాతాలను దుర్వినియోగం చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించిన తర్వాత గత రెండు వారాల్లో జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమ కావడం క్రమేణా తగ్గుతూ వచ్చింది.
నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రూ. 37 వేల కోట్లు జన్‌ధన్ ఖాతాల్లో జమయ్యాయి. వాటిలో నవంబర్ 8.15 మధ్య రూ.20,206 కోట్లు, నవంబర్ 16-22 మధ్య కాలంలో 11,347 కోట్లు జన్‌ధన్ ఖాతాల్లో జమ అయ్యాయి. నవంబర్ 23-30 మధ్య కాలంలో కేవలం 4,867 కోట్లు మాత్రమే జమయ్యాయి.

డిసెంబర్ 1వ తేదీన 410 కోట్లు, డిసెంబర్ 2వ తేదీన 389 కోట్లు జన్‌ధన్ ఖాతాల్లో చేరాయి. నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జన్‌ధన్ ఖాతాల్లో సగటున 13,113 కోట్ల రూపాయలు జమయ్యాయి. అదేం ప్రమాదకరమైంది కాదని అధికార వర్గాలు ఉంటున్నాయి.
జన్‌ధన్ ఖాతాల్లో జమ చేసుకునే పరిమితిని ప్రభుత్వం 50 వేల రూపాయలుగా పెట్టింది. ఖాతాలను దుర్వినియోగం చేస్తే ఐటి చట్టం కింద విచారిస్తామని ప్రభుత్వం ఆ తర్వాత హెచ్చరించింది.












Click it and Unblock the Notifications