ఏటీఎంలో పెడుతుండగానే నగదును దోచేశారు
ఢిల్లీలోని పాండవానగర్‌లో పట్టపగలే చోరీ జరిగింది. ఏటీఎంలో పెట్టేందుకు నగదు తరలిస్తున్న వ్యాన్‌ని అనుసరించిన ముగ్గురు దుండగులు రూ.5లక్షలు దోచుకెళ్లారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పాండవానగర్‌లో పట్టపగలే చోరీ జరిగింది. ఏటీఎంలో పెట్టేందుకు నగదు తరలిస్తున్న వ్యాన్‌ని అనుసరించిన ముగ్గురు దుండగులు రూ.5లక్షలు దోచుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు పెట్టేందుకు రూ.5లక్షల విలువ గల నోట్ల బ్యాగ్‌ను డ్రైవర్ వ్యానులో నుంచి తీస్తుండగా వెనకే ద్విచక్రవాహనంపై వెంబడిస్తున్న ముగ్గురు వ్యక్తులు మారణాయుధంతో బెదిరించి డ్రైవరు దగ్గర నుంచి నగదు బ్యాగ్‌ను లాక్కుని పరారయ్యారు.

నిందితులు ముగ్గురు హెల్మెట్లు ధరించినందున వారిని గుర్తుపట్టే అవకాశం లేకుండా పోయిందని పోలీసు అధికారులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
నిందితులు చాలా వేగంగా వచ్చారని ఏమి జరుగుతోందో తెలుసుకునేలోపే వారు పరారయ్యారని వ్యాను వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు తెలిపారు. దోపిడీకి పాల్పడిన మొత్తంలో అన్నీ రూ. 2000, రూ. 500 నోట్లే ఉన్నాయి.












Click it and Unblock the Notifications