ఈ ఏటీఎం కార్డుతో.. ఎన్నిసార్లు నగదు తీసుకున్నా.. నో సర్వీస్ ఛార్జ్

పోస్టాఫీసు సేవింగ్ ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డుతో ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా, రోజుకు ఎన్నిసార్లయినా నగదు తీసుకోవచ్చని, ఎలాంటి లావాదేవీ రుసుము ఉండదని తపాలాశాఖ పేర్కొంది.

చెన్నై: బ్యాంకులు విధిస్తున్న నిబంధనలతో ఏటీఎం కేంద్రాల వైపు, బ్యాంక్ బ్రాంచిలవైపు చూసేందుకే వినియోగదారులు జంకుతున్నారు. ఈ పరిస్థితిని తపాలా శాఖ తనకు అనువుగా మార్చుకుంటోంది.

పోస్టాఫీసులో రూ.50తో అకౌంట్ ప్రారంభిస్తే చాలు.. వెంటనే ఏటీఎం కార్డు కూడా అందజేస్తామని, తమ ఏటీఎం కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి సేవా రుసుములు విధించమని ప్రకటించుకుంటోంది.

దీని ప్రకారం.. కనిష్టంగా రూ.50 చెల్లించి తపాలా కార్యాలయాల్లో ఎవరైనా ఖాతా ప్రారంభించవచ్చు. పాస్ బుక్, ఏటీఎం కార్డు సౌకర్యం కలిగిన ఈ ఖాతాల ద్వారా సులభంగా నగదును తీసుకునే పథకాన్ని ప్రకటించింది.

Rs 50 minimum balance, no transaction fees: Can India Post be the answer to banks’ greed?

ఈ విషయమై తపాలాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తపాలా ఏటీఎం కార్డును ఉపయోగించి ఏ పోస్టాఫీసు, ఏ బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచైనా నగదు తీసుకోవచ్చని తెలిపారు.

ఈ ఏటీఎం కార్డుకున్న సౌలభ్యం ఏమిటంటే.. ఒకేరోజు ఎన్నిసార్లయినా నగదు డ్రా చేసుకోవచ్చు.. ఎన్నిసార్లు తీసుకున్నా ఎలాంటి సర్వీస్ ఛార్జీలు పడవు. బ్యాంకుల మాదిరిగానే తపాలా పొదుపు ఖాతాలకు 4 శాతం వడ్డీని అందిస్తున్నారు. పోస్ట్ పేమెంట్ బ్యాంకింగ్ అనే కొత్త పథకంలో డిపాజిట్లపై 4.5 నుంచి 5.5 శాతం వడ్డీని అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+