వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం సీజ్: ఎక్కడ అంటే..?

|
Google Oneindia TeluguNews

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని మహారాష్ట్రలో ఐటీ దాడులు చేసింది. జల్నా, ఔరంగబాద్‌లో పారిశ్రామిక వేత్త ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. అధికారులు అంచనా వేసినట్టు నగదు, బంగారం దొరికింది. ఉక్కు, రియల్ ఎస్టేట్, బట్టల వ్యాపారి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో చూపని నగదు, బంగారం సీజ్ చేశారు.

మొత్తం రూ.390 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. రూ. 58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం సీజ్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ నాసిక్ వింగ్ ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు జల్నా, ఔరంగాబాద్ నగరాల్లోని సదరు వ్యాపారి కార్యాలయాలు, నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించిన విషయం ఆలస్యంగా తెలిసింది. పట్టుబడిన నగదును లెక్కించేందుకు ఐటీ విభాగానికి 13 గంటల సమయం పట్టింది. కౌంటింగ్ మిషన్లతో లెక్కించడానికి ఆ మేరకు టైం పట్టింది.

Rs 58 crore cash, 32 kg gold seized in I-T dept

మొత్తం 260 మంది అధికారులు, ఉద్యోగులు ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో సోదాలు చేశారు. నగదు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. బంగారం కూడా దగ దగలాడుతూ కనిపించింది. దాదాపు 32 కిలోల సోన పట్టుబడింది.

English summary
Income Tax department conducted raids on the premises of a steel, cloth merchant and real estate developer in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X