మోదీ ఇంటికి వెళ్లిన ఆర్ఎస్ఎస్ చీఫ్- పహల్గామ్పై ఏం చేయబోతున్నారంటూ
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
రెండోసారి సీసీఎస్ భేటీ కానుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు కానుంది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. సీసీఎస్ సభ్యులు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, భద్రత వ్యవహారాల సలహదారు అజిత్ ధోవల్, కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇందులో పాల్గొననున్నారు.

దీనికి ముందు- ప్రధాని మోదీ మరో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఇందులో పాల్గొన్నారు.
వారితో పాటు త్రివిధ దళాధిపతులు ఈ భేటీకి హాజరు కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పహాల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగబోతోందంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో సహా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ భేటీ ముగిసిన వెంటనే- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ప్రధాని మోదీని కలిశారు. పాకిస్తాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోదీ అధికారిక నివాసానికి వెళ్లి మరీ ఆయనతో సమావేశం కావడం చర్చనీయాంశమౌతోంది. ఇదే భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.
26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడి చోటు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి వివరించినట్లు సమాచారం.

దశాబ్దాల కాలంగా భారత్‌ను పట్టి పీడిస్తోన్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి, పాకిస్తాన్ పీచమణచడానికి, ఇంకోసారి చొరబాట్ల గురించి ఆలోచన చేయని విధంగా బుద్ధి చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదని అటు మోదీ, ఇటు మోహన్ భగవత్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
అలాగే- పహల్గామ్ దాడి తరువాత జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం ప్రతి రోజూ భారత జవాన్ల అవుట్ పోస్టులపై కాల్పులకు పాల్పడుతున్నారని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు పాకిస్తాన్ నాలుగుసార్లు ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications