ఎన్నికలు: ముస్లీంలీగ్‌తో ఆరెస్సెస్ జత కడుతోందా?

తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)... ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్‌తో జత కట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిపిఐ(ఎం) చేసిన ఈ ఆరోపణలు కేరళలో చర్చనీయాంశమయ్యాయి.

జనవరి 26వ తేదీన ఆరెస్సెస్‌కు చెందిన గోపాలకుట్టి ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ (ఐయూఎంఎల్) కార్యాలయానికి వెళ్లారు. ఆయన ఐయూఎంఎల్ నాయకులను కలిశారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) వారిపై మండిపడుతోంది.

RSS forged alliance with Indian Union Muslim League for Kerala Assembly elections?

ఐయూఎంఎల్ నాయకులు తమ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా, లౌకికవాదాన్ని పక్కన పెట్టి ఓట్ల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఐ(ఎం) మండిపడింది. ఐయూఎంఎల్ కేరళలో రాజకీయ పార్టీ. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికలు మే - జూన్ నెలలో జరగనున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆరెస్సెస్ నేత గోపాల కుట్టి ఐయూఎంఎల్ నాయకులను కలిసి పొత్తు పైనే చర్చించారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+