వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి ఆర్ఎస్ఎస్ దెబ్బ! : నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖ

ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖనేత కేఎన్.గోవిందాచార్య నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తాజాగా కేంద్ర ఆర్థికవ్యవహారాల శాఖా కార్యదర్శి శక్తికాంత్ దాస్‌కి లేఖ రాశారు. లేఖలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిర

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఓవైపు నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో.. బీజేపీ అనుబంధ సంస్థ నుంచే మోడీ సర్కార్ కు వ్యతిరేక గళం వినిపించడం.. పార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేదిగా మారింది.

ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖనేత కేఎన్.గోవిందాచార్య నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తాజాగా కేంద్ర ఆర్థికవ్యవహారాల శాఖా కార్యదర్శి శక్తికాంత్ దాస్‌కి లేఖ రాశారు. లేఖలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న 40మంది చావులకు బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

RSS leader letter to Shaktikantha Das by opposing Currency ban

నోట్ల రద్దు కారణంగా.. చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వమే నష్ట పరిహారం అందించాల్సిందిగా లేఖ ద్వారా డిమాండ్ చేశారు. మూడు రోజుల్లోగా మృతులకు కుటుంబాలకు పరిహారం అందించాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సరైన ప్రణాళి లేకుండా.. సామాన్యులను గందరగోళం పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోను పోస్టు చేశారు గోవిందాచారి. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణించిన ఆయన.. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం నోట్ల రద్దు నిర్ణయాధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ లో సూచించిన 'జీవించే హక్కు'ను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

English summary
RSS Leader KN Govindacharya was written a letter to Revenue service official Shaktikantha das. He questioned govt that who will takes the responsibility of deaths of currency ban effect?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X