
స్వాతంత్ర్య పోరాటానికి ఆర్ఎస్‌ఎస్ ద్రోహం- సావర్కర్‌ను పోషించిన బ్రిటీషర్స్..!!
బెంగళూరు: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారత్ జోడో యాత్ర చేపట్టిన ఆయన ఇవ్వాళ కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ ఉదయం జిల్లాలోని మయసంద్ర నుంచి యాత్రను చేపట్టారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కావడం వల్ల రాహుల్ గాంధీ యాత్రపై అందరి దృష్టీ నిలిచింది.
చంద్రబాబు
పాచిక
-
మునుగోడు
బరిలో
టీడీపీ
-
ఆ
నేత
కోసం
బీఫాం
సిద్ధం?

కీలక వ్యాఖ్యలు..
తుమకూరు జిల్లాలో ఈ మధ్యాహ్నం ఏర్పాటైన సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై ఘాటు ఆరోపణలను సంధించారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆర్ఎస్ఎస్.. బ్రిటీషర్లకు అనుకూలంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యోద్యమానికి ద్రోహం చేసిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీషర్లకు సహాయ పడిందని రాహుల్ గాంధీ అన్నారు.

సావర్కర్‌కు స్టైపెండ్..
స్వాతంత్ర్యోద్యమంలో భారత్‌కు వ్యతిరేకంగా పని చేసినందుకు సావర్కర్‌కు బ్రిటీష్ ప్రభుత్వం నుంచి ప్రతినెలా స్టైపెండ్ అందేదని రాహుల్ గాంధీ చెప్పారు. దశాబ్దాల కాలం పాటు సాగిన పోరులో బీజేపీ ఉనికి ఎక్కడ ఉందని ఆయన సూటిగా ప్రశ్నించారు. స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ ఎక్కడా లేదని గుర్తు చేశారు. ఇలాంటి వాస్తవాలను బీజేపీ దాచిపెట్టలేదని చెప్పారు. దేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం కాంగ్రెస్ ఎడతెగని పోరు సాగించిందని అన్నారు.

నాపై దాడి కోసం..
తనపై దాడి చేయడానికి బీజేపీ వేల కోట్ల రూపాయలను మీడియాకు వెదజల్లిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తనను అసమర్థుడిగా, అశక్తుడిగా చిత్రీకరించడానికి ఓ వ్యవస్థ, యాంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తారు. ఆర్థికంగా అత్యంత బలమైన వ్యవస్థ కావడం వల్ల బీజేపీ కుయుక్తులు చెల్లుబాటు అవుతున్నాయని విమర్శించారు. అసత్యాలు, అవాస్తవాలను నిజంగా ప్రజల మనస్సులో నాటుకుపోయేలా చేస్తోందని రాహుల్ అన్నారు.

కొత్త విద్యా విధానానికి వ్యతిరేకం..
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానానికి తాము వ్యతిరేకమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ విధానాన్ని దేశ నైతికతపై దాడిగా ఆయన అభివర్ణించారు. మన ఘన చరిత్రను ఇది వక్రీకరించేలా ఉందని స్పష్టం చేశారాయన. కొందరి చేతిలో అధికారాన్ని కేంద్రీకరించేలా ఈ విధానాన్ని బీజేపీ రూపొందించిందని ఆరోపించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వికేంద్రీకృత విద్యా వ్యవస్థ అవసరమని రాహుల్ గాంధీ వివరించారు.