రుక్సానా కౌసర్: ఉగ్రవాదిని నరికి చంపిన సాహసవంతురాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: రుక్సానా కౌసర్ జమ్ము కాశ్మీర్‌కు చెందిన మహిళ. ఆమె 1989లో రాజౌరి జిల్లాలో జన్మించింది. 2009లో లష్కరే తోయిబా మిలిటెంట్‌ను గొడ్డలితో నరికి చంపింది.

కాశ్మీర్ తీవ్రవాదుల గుండెల్లో బుల్లెట్లు దింపిన మహిళ రుక్సానా. జమ్మూకి 217 కి.మీ. దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం ఆమెది. కాశ్మీర్లో తీవ్రవాదుల దుశ్చర్యలు, కల్లోలం, రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడటం, ఆకస్మిక దాడులకు తెగబడటం, అమ్మాయిల అపహరణలు, లైంగిక వేధింపులు నరకయాతనగా ఉండేది.

Rukhsana Kausar, The Courageous Lady Who Made Our Motherland Proud

అలాంటి తీవ్రవాదులపై గొడ్డలితో విరుచుకుపడి, ఒకరిని చంపి... మిగిలిన వారిని పరుగులు తీయించింది. ఆమె హతమార్చింది ఒక కమాండర్ స్థాయి తీవ్రవాదిని. రుక్సానా బాగా చదువుకున్న అమ్మాయి కాదు. తండ్రి వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయ పనులు లేనప్పుడు రోజుకూలీగా పని చేసేవాడు. సరిహద్దు జిల్లా రాజౌరీ.

ఎనిమిదేళ్ల క్రితం ఓసారి రుక్సానా కుటుంబం తీవ్రవాదుల దాడికి గురైంది. తండ్రి గాయాల పాలయ్యాడు. తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడం, వారు పడిపోవడం గమనించిన ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొంది.

లష్కరే తోయిబా తీవ్రవాదిని హతమార్చి వీరనారిగా పేరు సాధించిన రుక్సానా కౌసర్‌ను ప్రత్యేక పోలీసు అధికారిగా నియమించారు. ఆమెతో పాటు తీవ్రవాదుల దాడిలో గాయపడ్డ ఆమె సోదరుడు ఐజజ్‌, పినతండ్రి హుస్సేన్‌లను కూడా పోలీసు ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rukhsana Kausar was the women of bravery. She made the entire women proud by her courageous act. The lady was not much educated but played an important role in demolishing the terrorist. She stands as a role model to all women who have the urge to be bold and brave.
Please Wait while comments are loading...