తాళిబొట్టులో పగడాలు ఉంటే భర్తకు ప్రాణహాని!?: పగలగొట్టుకున్న వివాహితలు..
కర్ణాటకలో వ్యాపించిన ఈ వదంతులతో అక్కడి ప్రజల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
బెంగుళూరు: కర్ణాటకలో 'తాళిబొట్టు'పై పలు వదంతులు వ్యాపించాయి. తాళిబొట్టులో పగడాన్ని ధరించడం అశుభమని,
అలా చేయడం ద్వారా భర్తకు ప్రాణహాని ఉంటుందని తీవ్రమైన వదంతులు వ్యాపించాయి. దీంతో చాలామంది వివాహిత స్త్రీలు తమ తాళిబొట్లలోని పగడాలను పగలగొట్టుకున్నారు.

కర్ణాటకలో వ్యాపించిన ఈ వదంతులతో అక్కడి ప్రజల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు పుట్టించారో తెలియదు గానీ అశుభమంటూ జనమంతా ఊదరగొట్టడంతో.. వివాహిత స్త్రీలు ఈ చర్యకు పూనుకున్నారు. తాళిబొట్టును ఎక్కువగా ధరించేది హిందూ వివాహిత మహిళలే కాబట్టి.. వాళ్లలోనే ఎక్కువమంది పగడాలను పగలగొట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications