మీ ఆడవాళ్లను పంపించండి.. రేప్ జరగకుండా తిరిగొస్తే గొప్పే?: బీజేపీ మహిళా ఎంపీ సంచలనం
మమతా సర్కార్‌ను,కాంగ్రెస్‌ను ప్రశంసిస్తున్నవారు 15రోజుల పాటు తమ ఇంటి ఆడవాళ్లను బెంగాల్ పంపించాలని, వారు అత్యాచారానికి గురికాకుండా తిరిగిరావాలని సవాల్ విసిరారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంటున్న హింసను ఉద్దేశించి బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా సర్కార్‌ను,కాంగ్రెస్‌ను ప్రశంసిస్తున్నవారు 15రోజుల పాటు తమ ఇంటి ఆడవాళ్లను బెంగాల్ పంపించాలని, వారు అత్యాచారానికి గురికాకుండా తిరిగిరావాలని సవాల్ విసిరారు.
ఒకవేళ వారు గనుక 15రోజుల్లో అత్యాచారానికి గురికాకుండా తిరిగొస్తే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని అన్నారు. వారికి నిజంగా అక్కడ ఏ హాని జరగకుండా ఉంటే, అది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.

'పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ను ప్రశంసిస్తున్నవారిని నేను సవాల్ చేస్తున్నాను. మీ ఇంటి అమ్మాయిలను, కోడళ్లను, భార్యలను, బెంగాల్ పంపించండి. 15రోజులు వారక్కడ గడిపి అత్యాచారానికి గురికాకుండా వస్తే అప్పుడు చెప్పండి' అంటూ రూపా గంగూలీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం చనిపోయిందని అన్నారు.
దాదాపు నెలరోజులుగా ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమం, బషిర్ హట్ మతకల్లోలాల నేపథ్యంలో మమతా సర్కార్ కష్టకాలంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఏ అధికారి పనిచేయడం లేదని, గూర్ఖాలాండ్ ఉద్యమంతో బెంగాల్ హింసకు కేంద్రంగా మారిందని అన్నారు.












Click it and Unblock the Notifications