వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు చమురుపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన రష్యా: గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్

|
Google Oneindia TeluguNews

మాస్కో/న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల విధిస్తున్న ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చమురు ధరలను భారీగా తగ్గించి భారత్‌కు ఎగుమతి చేసేందుకు రష్యా సిద్ధమైంది.

భారత్‌కు రష్యా భారీ డిస్కౌంట్ ఆఫర్

భారత్‌కు రష్యా భారీ డిస్కౌంట్ ఆఫర్



ఇప్పటికే భారత్‌కు చౌక ధరకే ముడిచమురును విక్రయించేందుకు ముందుకొచ్చిన రష్యా.. తాజాగా మరింత డిస్కౌంట్ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రష్యా నుంచి 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును డిస్కౌంట్‌లో కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా, భారత్‌కు ఎగుమతులు పెంచుకునేందుకు రష్యా భారీగా డిస్కౌంట్ ఆఫర్ చేసింది.

అందుబాటులోకి రూబుల్-రూపాయి చెల్లింపు విధానం

అందుబాటులోకి రూబుల్-రూపాయి చెల్లింపు విధానం

యుద్ధానికి ముందున్న ధరకే ఉరాల్ క్రూడ్‌ను విక్రయిస్తామని రష్యా ఆఫర్ చేసిందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది 15 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును భారత్ దిగుమతి చేసుకునేలా రష్యా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు రూబుల్-రూపాయి చెల్లింపు విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించినట్లు సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

రష్యా ఆఫర్‌భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం

రష్యా ఆఫర్‌భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం

కాగా, ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీస్ లవ్రోవ్.. కేంద్రంతో జరిపే చర్చల్లో ప్రధానంగా చౌక చమురు దిగుమతులపైనే దృష్టిపెట్టినట్లు తెలిసింది. అంతర్జాతీయంగా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్న వేళ.. రష్యా డిస్కౌంట్ ఆఫర్‌ను భారత్ స్వాగతించే అవకాశం లేకపోలేదు. రష్యా తాజా డిస్కౌంట్ ఆఫర్‌తో వచ్చే దిగుమతులు దేశంలో చమురు ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ఇది ఇలావుంటే, రష్యా నుంచి డిస్కౌంట్ కు చమురు దిగుమతి చేసుకున్నా.. అమెరికా భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని సూచిస్తోంది. అయితే, ఐరోపా దేశాలే ఎక్కువ చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుండటం గమనార్హం. ఇదే విషయాన్ని భారత్ ప్రస్తావిస్తూ కౌంటర్లు ఇస్తోంది.

English summary
Russia offering oil to India at Big discounted price: reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X