ఢిల్లీ చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి.. రేపు జై శంకర్, మోడీతో భేటీ
రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితి కాస్త సద్దుమణిగింది. కానీ అమెరికా.. ఇతర దేశాలు మాత్రం ఆ దేశంపై భగ్గుమంటున్నాయి. ఇంతలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జీ లావ్‌రోవ్ భారత పర్యటనకు వచ్చారు. ఇంకేముంది ఆ దేశాలు ఇండియాపై కూడా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. లావ్ రోవ్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రష్యా నుంచి చైనా వెళ్లిన లావ్‌రోవ్..అక్కడి నుంచి నేరుగా భారత్‌కు వచ్చారు.

లావ్ రోవ్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. శుక్రవారం నుంచి ఆయన వచ్చిన పని ప్రారంభం అవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అంతకుముందే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తోనూ ఆయన భేటీ అవుతారు. ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధంపై తొలిసారి కాస్తంత వెనక్కు తగ్గినట్టు కనిపించిన మరుక్షణమే బుధవారం నాడు లావ్‌రోవ్ భారత పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే.
లావ్ రొవ్‌కు భారత విదేశాంగ శాఖ వెల్ కం తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగి ట్వీట్ చేశారు. మీడియా అడ్వైజరీలో మాత్రం జై శంకర్, మోడీతో భేటీ అవుతారని పేర్కొనలేదు. ఇటు యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయంపై మోడీతో లావ్‌రోవ్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications