Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్త ఆంక్షలు: వారికి మరింత కష్టం: బోసిపోతోన్న శబరి గిరులు

తిరువనంతపురం: కేరళలోని శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులపై అక్కడి అధికారులు ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షల నడుమ అయ్యప్పుడి దర్శనం కొనసాగుతోంది. శబరి గిరీశుడిని దర్శించడానికి రోజూ వెయ్యిమంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వారంతాపు రోజుల్లో ఈ సంఖ్యను రెండు వేల వరకు ఉంటుంది. రోజువారీ భక్తుల సంఖ్యను భారీగా పెంచాలంటూ భక్తులు ట్రావెన్‌కూర్ దేవస్వొం బోర్డు అధికారులను విజ్ఙప్తి చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో..కొత్తగా ఆంక్షలను ప్రవేశపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

Recommended Video

    #SabarimalaTemple : అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్త ఆంక్షలతో బోసిపోతోన్న శబరి గిరులు...!

    జీవనోపాధి కోసం శబరిమల ఆలయ పరిసరాల్లో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారులపై దేవస్వొం అధికారులు కొత్తగా ఇంక్షలను విధించారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే వారిని కూడా అనుమతి ఇస్తామని ప్రకటించారు. ఇదివరకెప్పుడో చేయించుకున్న నెగెటివ్ రిపోర్టులు తీసుకుని వస్తే అనుమతించబోమని, కొత్తగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన నివేదికలను వెంట తీసుకొస్తేనే దుకాణాలను తెరవడానికి వీలు కల్పిస్తామని తేల్చి చెప్పారు.

    Sabarimala 2020: After devotees, COVID19 negative report mandatory for shop keepers

    కొత్తగా తీసుకోవాల్సిన, ప్రవేశపెట్టాల్సిన చర్యలపై పత్తినంథిట్ట అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అరుణ్ కే విజయన్, పోలీస్ స్పెషల్ ఆఫీసర్ బీ కృష్ణ కుమార్ సమీక్ష నిర్వహించారు. శబరిమల ఆలయం పరిసరాలతో పాటు మార్గమధ్యలో దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారిని కూడా నిబంధనల పరిధిలోకి తీసుకుని రావాలని ఈ భేటీలో నిర్ణయించారు. వ్యాపారాలను నిర్వహించుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

    ఇదిలావుండగా- రోజువారీ ఆలయ ఆదాయం క్షీణించడం వల్ల భక్తులకు వసతులను కల్పించడానికి నిధుల కొరత ఏదురవుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌ను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మండలపూజ, మకరవిలక్కం సీజన్ ప్రారంభం అయిన సందర్బంగా పరిమితి సంఖ్యలో శబరిమలలోకి అయ్యప్పస్వామి భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఎకువ మంది అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు తగ్గట్లుగా తాము ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+