శబరిమల చరిత్రలోనే తొలిసారి.. అరవణ ప్రసాదంపై తీవ్ర ఆంక్షలు

మండల పూజల సమయం దగ్గరపడుతున్న వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో ఊహించని ప్రసాదం సంక్షోభం తలెత్తింది. అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే 'అరవణ ప్రసాదం' కొరత తీవ్రం కావడంతో సన్నిధానంలో విక్రయాలను అధికారులు పరిమితం చేశారు.

కన్ని మాసం పూజల సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఈ సమస్య మరింత జటిలమైంది. ఒక్కో భక్తుడికి కేవలం ఒకే ఒక్క అరవణ టిన్, మూడు అప్పం ప్యాకెట్లు మాత్రమే విక్రయించేలా ఆంక్షలు విధించారు. నిల్వలు లేక ఆదివారం మధ్యాహ్నం కౌంటర్లను కొన్ని గంటల పాటు మూసివేయడం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Sabarimala Aravana Prasadam Shortage Sparks Heavy Row Between Kerala Minister and Devaswom Board

భారీగా పెరిగిన భక్తులు.. నిలిచిపోయిన ఉత్పత్తి

అరవణ ప్లాంట్‌లో అత్యవసర మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపడుతుండటంతో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేడమే ఈ కొరతకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కన్ని మాస పూజ కోసం అధికారులు సుమారు 2.6 లక్షల టిన్లను సిద్ధం చేసినప్పటికీ, అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో నిల్వలన్నీ ఖాళీ అయ్యాయి. మిగిలిన కొద్దిపాటి స్టాక్ కూడా పూర్తయితే ప్రసాదం విక్రయాలను పూర్తిగా నిలిపివేయక తప్పదని అధికారులు చెబుతున్నారు. అయితే అప్పం ప్రసాదానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని తెలిపారు.

Sabarimala కేసులో బిగ్ ట్విస్ట్! భక్తుల పక్షాన కేంద్ర ప్రభుత్వం..
Sabarimala కేసులో బిగ్ ట్విస్ట్! భక్తుల పక్షాన కేంద్ర ప్రభుత్వం..

మంత్రి తీవ్ర ఆగ్రహం.. హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం!

ఈ వ్యవహారంపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె.మురళీధరన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాంట్ మూసివేత వల్ల ఇలాంటి సంక్షోభం వస్తుందని గత మూడు నెలలుగా బోర్డు అధికారులు తన కార్యాలయానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి రావడంపై బాధ్యులెవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యల కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు.

Sabarimala ఆలయంలోకి మహిళల ప్రవేశం, సుప్రీం డెడ్ లైన్
Sabarimala ఆలయంలోకి మహిళల ప్రవేశం, సుప్రీం డెడ్ లైన్

బోర్డు వివరణ.. ఉద్యోగుల నుంచి నిరసన స్వరం!

మరోవైపు దేవస్థాన బోర్డు ఈ ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేసింది. త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక 'మండల-మకరవిలక్కు' తీర్థయాత్ర సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్లాంట్ మరమ్మతులు చేపట్టామని వివరించింది. అయితే బోర్డు ఉద్యోగుల సంఘాలు మాత్రం బోర్డు యాజమాన్యంపై మండిపడుతున్నాయి. శబరిమల చరిత్రలో నెలవారీ పూజల సమయంలో అరవణ ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే తొలిసారని, ప్రణాళికారాహిత్యం వల్ల రూ. 4 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నాయి. పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం, దేవస్వమ్ బోర్డు మధ్య నడుస్తున్న ఈ రచ్చ భక్తులను కలవరపెడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+