నేటి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత...
ఈ మధ్యకాలంలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తరచుగా వార్తల్లోకెక్కింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈసారి భక్తులు ఏ స్థాయిలో వెళ్లారో అందరికీ తెలిసిందే. స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులకు సరైన వసతులు అందించడంలో అధికారులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అధిక భక్త జనసంద్రోహంతో శబరిమల ఆలయం నిండిపోయింది. ఈ భక్తుల తోపులాటలో ఓ బాలిక మరణించిన సంగతి కూడా తెలిసిందే. 39 రోజుల్లోనే శబరిమల ఆలయం ఆదాయం రూ. 200 కోట్లు దాటిందంటే ఇక్కడ భక్తుల తాకిడి ఎలా ఉందో అర్థమయిపోతుంది. అయితే, ఇప్పుడు శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు రారు. ఎందుకంటే డిసెంబర్ 27 నుంచి ఈ ఆలయాన్ని మూసివేస్తున్నారు.
అయ్యప్ప మాల వేసిన భక్తులు ఇరుముడితో కేరళ బయలుదేరుతారు. ఈ ఇరుముడితోనే అక్కడ పూజలు నిర్వహిస్తారు. అయతే, ఈ పూజలు డిసెంబర్ 27తో ముగుస్తాయి. రాత్రి పూజా కార్యక్రమాల అనంతరం అర్థరాత్రి 11గంటలకు అయ్యప్ప ఆలయాన్ని మూస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మండల పూజల అనంతరం శబరిమల ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో అక్కడ మకరవిళక్కు ఉత్సవం నిర్వహిస్తారు.

మకరవిళక్కు ఉత్సవం అంటే : మకరవిళక్కు ఉత్సవం అంటే మకర జ్యోతి దర్శనం. అయ్యప్ప స్వామి దీక్షలో జ్యోతి దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే, ఈ జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు. డిసెంబర్ 30న సాయంత్రం ఐదు గంటలకు ఆలయ తలుపులు తీస్తారు. ఈ జ్యోతి దర్శనం జనవరి 15న సాయంత్రం 6.36 గంటలకు ఉంటుంది. మండల పూజల అనంతరం మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఈ జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ మకర జ్యోతిని దర్శించుకుంటే జీవితంలో సకల దోషాలూ తొలగిపోయి, సుఖశాంతులు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. జ్యోతి దర్శనం అనంతరం జనవరి 20న శబరిమల ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ రోజుతో శబరిమల వార్షిక యాత్ర సమాప్తమతువుంది. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లను చేస్తున్నారు.












Click it and Unblock the Notifications