వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల ఆలయంలో పూజలు: మహిళల అడ్డగింత, పోలీసుల లాఠీచార్జీ, ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

శబరిమల: అన్ని వయస్సుల మహిళలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం శబరిమల ఆలయం బుధవారం సాయంత్రం తొలిసారిగా తెరుచుకోనుంది. అయితే సుప్రీం తీర్పును నిరసిస్తూ పలువురు ఆందోళనకారులు మహిళలను అడ్డుకుంటుండడంతో శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Recommended Video

    శబరిమల ఆలయ ప్రవేశం: ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జీ

    శబరిమలలో ఉద్రిక్తత: ఏపీ మహిళకు ఆందోళనకారుల బెదిరింపు, వెనక్కి తప్పలేదుశబరిమలలో ఉద్రిక్తత: ఏపీ మహిళకు ఆందోళనకారుల బెదిరింపు, వెనక్కి తప్పలేదు

    ఈ నేపథ్యంలో పోలీసులు ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు చేపట్టారు. బుధవారం ఉదయం శబరిమలకు వెళ్లే ప్రధాన మార్గం అయిన నీలక్కల్‌ వద్ద ఆందోళనకారులు ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.

    Sabarimala Temple opening LIVE: Stone pelting reported in Nilakkal

    ఆలయానికి 20 కి.మీ దూరం ఉండే నీలక్కల్‌ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, తీవ్ర నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాధవి అనే మహిళ శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి స్వామిని దర్శించుకోకుండానే పంబా నుంచి వెనక్కి తిరగాల్సి వచ్చింది. నిరసనకారులు అడ్డుకోవడంతో తన కుటుంబంతోపాటు ఆ మహిళ అక్కడ్నుంచి తిరుగుపయనమైంది.

    Newest First Oldest First
    6:33 PM, 17 Oct

    శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న అర్చకులు.
    6:18 PM, 17 Oct

    అక్టోబర్ 22 వరకు ఆలయం ప్రవేశం కొనసాగుతుంది.
    6:18 PM, 17 Oct

    బుధవారం రాత్రి 10.30గంటల వరకు భక్తులకు శబరిమల అయ్యప్ప దర్శనం ఉంటుంది.
    6:17 PM, 17 Oct

    శబరిమల ఆలయం తెరుచుకున్నప్పటికీ మహిళా(10-50ఏళ్ల) భక్తులను మాత్రం నిలిపివేయడం జరిగింది.
    5:32 PM, 17 Oct

    మహిళలను అడ్డుకుంటూ.. ఆందోళనకు దిగిన నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
    5:21 PM, 17 Oct

    ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళలను నిరసనకారులు తీవ్రంగా అడ్డుకుంటున్నారు.
    5:21 PM, 17 Oct

    బుధవారం సాయంత్రం 5గంటలకు శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.
    4:28 PM, 17 Oct

    నీలక్కల్ బేస్ క్యాంపు వద్ద పోలీసులు లాఠీ ఛార్జీ చేస్తుండగా, ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
    4:01 PM, 17 Oct

    నీలక్కల ప్రాంతంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
    4:00 PM, 17 Oct

    తాను ప్రశాంత వాతావరణంలో భోజనం చేస్తుండగా తనను పోలీసులు అరెస్ట్ చేశారని రాహుల్ ఈశ్వర్ అన్నారు.
    3:59 PM, 17 Oct

    సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ ఆందోళనలకు దిగడం సరికాదని, భక్తుల రూపంలో వచ్చిన కొందరు దాడులకు పాల్పడుతున్నారని కేరళ మంత్రి శైలజ ఆరోపించారు.
    3:02 PM, 17 Oct

    రిపబ్లిక్ టీవీ మహిళా జర్నలిస్టు ప్రసన్న వాహనాన్ని అడ్డుకుంటున్న భక్తులు, ఆందోళనకారులు. కారుపై దాడి చేసి ఆమెను ముందుకు కదలనీయలేదు.
    3:01 PM, 17 Oct

    బుధవారం సాయంత్రం 5గంటలకు అయ్యప్ప ఆలయం తెరచుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
    3:00 PM, 17 Oct

    బీజేపీ నేతలు కూడా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగారు.
    2:58 PM, 17 Oct

    శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు.
    2:01 PM, 17 Oct

    నిరసనల నేపథ్యంలో పంబాలో 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
    1:27 PM, 17 Oct

    పోలీసుల సహాయంతో మాధవి కొద్ది దూరం పాటు ప్రయాణించింది. తర్వాత ఆమెను బస్సులో పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆమెను బస్సులో ఎక్కించుకొని ఆలయం వద్దకు తీసుకెళ్తే బస్సునే తగలబెడతామని ఆందోళనకారులు బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె వెనుదిరగక తప్పలేదు.
    1:26 PM, 17 Oct

    పాత్రికేయురాలు లిబి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. అలప్పుజ ప్రాంతంలో ఆమె వెళ్తున్న సమయంలో ఆందోళనకారులు లిబిపై దాడి చేశారు. ఈమెతో పాటు పంబ వద్ద ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు మాధవిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. వారిద్దరినీ బలవంతంగా వెనక్కి పంపించారు.
    1:12 PM, 17 Oct

    10-50ఏళ్ల వయస్సు గల మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ మాజీ ప్రెసిడెంట్ ప్రాయర్ గోపాలకృష్ణతోపాటు 20మందిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
    1:04 PM, 17 Oct

    కాగా, నీలక్కల్ ప్రాంతంలో పలు మీడియా వాహనాలపైనా ఆందోళనకారులు దాడులు చేశారు.
    12:35 PM, 17 Oct

    ఆలయానికి 20 కి.మీ దూరం ఉండే నీలక్కల్‌ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి స్వామిని దర్శించుకోకుండానే పంబా నుంచి వెనక్కి తిరగాల్సి వచ్చింది.
    12:33 PM, 17 Oct

    భక్తులను అడ్డుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నీలక్కల్‌ ప్రాంతం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. ఇక్కడ 500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. వీరిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు.
    12:33 PM, 17 Oct

    బస్సులు, వాహనాలను నిలిపివేసి అందులో ఆలయ దర్శనానికి వెళ్తున్న మహిళలను దింపివేస్తున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. టెంట్లను తొలగించి వారిని చెదరగొట్టారు.
    12:32 PM, 17 Oct

    మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ శబరిమల ఆచార సంరక్షణ సమితి సభ్యులు నీలక్కల్‌ వద్ద ఆందోళనకు దిగారు. టెంట్లు వేసుకొని సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
    12:31 PM, 17 Oct

    మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని కేరళ సర్కారు స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పునకే తాము కట్టుబడి ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం మరోసారి స్పష్టం చేశారు. సుప్రీం నిర్ణయాన్ని కాదని ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని అన్నారు.

    English summary
    The Sabarimala temple in Kerala will open its doors for Thulam rituals to women of all age groups for the first time at 5 pm after the historic Supreme Court ruling that permitted the entry.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X