Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sabarimala: శబరిమలలో తంక-అంకికి శ్రీకారం, అయ్యప్ప నగలు ఊరేగింపు, జీవితం ధన్యం, భక్తులకు!

శబరిమల/ కొచ్చి/ తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలలో మండలపూజ నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. అయ్యప్పస్వామికి ఎంతో పవిత్రమైన బంగారు నగలు తీసుకెళ్లే 'తంక-అంకి' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అరుణ్ముల పార్థసారథి ఆలయంలోని ఉన్న అయ్యప్పస్వామికి రాజుల కాలంలో తయారు చేయించిన బంగారు, వజ్రాల నగలు శబరిమల ఆలయానికి తీసుకెళ్లారు. అయ్యప్పస్వామి బంగారు నగలు వీక్షించడానికి భక్తులకు ఈ ఏడాది కేవలం 90 నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చారు.

బంగారు వాహనంలో నగలు

బంగారు వాహనంలో నగలు

శబరిమల అయ్యప్పస్వామికి రాజుల కాలంలో తయారు చేయించిన నగలకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అరణ్ములలోని పార్థసారథి దేవాలయంలో ఉన్న అయ్యప్పస్వామి ఆభరణాలను ఊరేగింపుగా శబరిమలలోని అయ్యప్ప సన్నిధానానికి తీసుకెళ్లారు. భారీ బందోబస్తుతో ప్రతిఏడాది అటవి మార్గంలో అయ్యప్ప స్వామి ఆభరణాలను శబరిమలకు తీసుకెళ్లడం అనవాయితీగా వస్తోంది.

భక్తకు చిన్న అవకాశం

ప్రతి ఏడాది అయప్ప స్వామి ఆభరణాలను తీసుకెళ్లే వాహనానికి ఇరు వైపుల అయ్యప్పస్వామి భక్తులు నిలబడి స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామిని తలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంటుంది. అయితే కోవిడ్ నియమాలు అమలులో ఉన్న సందర్బంగా ఈ ఏడాది అయ్యప్పస్వామి అభరణాలు తీసుకెళ్లే సమయంలో మార్గం ఇరు వైపుల అయ్యప్ప భక్తులు నిలబడటానికి చాలా తక్కవ మందికి అవకాశం ఇచ్చారు. భారీ బందోబస్తు మద్య అయ్యప్పస్వామి నగల ఊరేగిపు జరిగింది.

అయ్యప్పస్వామిని చూస్తే జీవితం ధన్యం

అయ్యప్పస్వామిని చూస్తే జీవితం ధన్యం

హిందువులు చాలా మంది వారి జీవితంలో ఒక్కసారైనా అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని దేవుడిని ప్రార్థిస్తుంటారు. నవంబర్ 15వ తేదీన కేరళలోని శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలో మండల పూజలు నిర్వహించారు. నవంబర్ 16వ తేదీ నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలలోని సన్నిధానంలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అయ్యప్ప భక్తులకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు సుమారు 1 లక్ష 3 వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.

90 నిమిషాలు చూసే చాన్స్

90 నిమిషాలు చూసే చాన్స్

అరణ్ములలోని పార్థసారథి దేవాలయంలో ఉన్న అయ్యప్పస్వామి ఆభరణాలను చూడటానికి వేకువ జామున 5 గంటల నుంచి ఉదయం 6. 30 గంటల వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. కేవలం 90 నిమిషాలు మాత్రమే అయ్యప్పస్వామి నగలు చూడటానికి భక్తులకు అవకాశం ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అయ్యప్ప భక్తులు ఎక్కువ సమయంలో స్వామివారి నగలు దర్శించుకోలేకపోయారు.

పంపా నది నుంచి శబరిమలకు

పంపా నది నుంచి శబరిమలకు

కేరళలోని పుణ్య నది పంపాలోని గణపతి దేవాలయంలోని నండప్పండల్ మండపంలో అయ్యప్పస్వామి ఆభరణాలు ప్రదర్శనకు పెట్టారు. తరువాత ఊరేగింపుగా పంపా నుంచి శబరిమలకు దట్టమైన అటవి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతతో అయ్యప్పస్వామి ఆభరణాలను తీసుకెళ్లారు. ప్రతి ఏడాది కొన్ని వేల మంది ఆ రోజు అయ్యప్పస్వామి ఆభరణాలు తీసుకెళ్లే వాహనాన్ని చూసేవాళ్లు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది చాలా మంది అయ్యప్పస్వామి భక్తులకు ఆ అవకాశం దక్కలేదు.

మండళపూజకు సర్వం సిద్దం

మండళపూజకు సర్వం సిద్దం

శబరిమలకు తీసుకెళ్లిన ఆభరణాలను 18 మెట్లు మీద నుంచి అయ్యప్ప సన్నిధానంలోకి తీసుకు వెలుతారు. డిసెంబర్ 25వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్బంగా అదే రోజు సాయంత్రం 6. 30 గంటలకు అయ్యప్పస్వామిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. ఆరోజు రాత్రి అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. డిసెంబర్ 26వ తేదీన మద్యాహ్నం 12 గంటలకు అయ్యప్పస్వామి సన్నిధానంలో మండలపూజలు చెయ్యడానికి అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ నియమాల ప్రకారం 5 వేల మంది మాత్రమే శబరిమలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి కేరళ హైకోర్టు, ఆ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+