అమెరికన్ల చేతిలో భారత ఫోన్లుండాలి: సచిన్ కల
న్యూఢిల్లీ: భారతీయులు తయారు చేసిన ఫోన్లను అమెరికన్ల చేతిలో చూడలన్నదే తన కల అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలనుకుంటున్న దేశీయ కంపెనీలకు తాను మనస్ఫూర్తిగా మద్దతిస్తానని అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్‌రాన్ కంపెనీ తయారు చేసిన స్మార్ట్‌ఫోన్, రెండు విధాలుగా ఉపయోగించుకునే నోట్‌బుక్‌లను విడుదల చేసిన సందర్భంగా సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇది నా రెండో ఇన్నింగ్స్. మొదట క్రికెట్ ఆడాను. ఇప్పుడు వ్యాపారవేత్తలతో భాగస్వామి అవుతున్నాను' అని సచిన్ వెల్లడించారు.
స్మార్ట్‌రాన్‌లో సచిన్ పెట్టుబడులు సైతం పెట్టారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సైతం వ్యవహరించనున్నారు. అయితే పెట్టుబడుల వివరాలను సచిన్ వెల్లడించలేదు.

వినియోగదారు వస్తువులనే కాకుండా.. క్లౌడ్ స్టోరేజ్, రూటర్లు, స్టోరేజ్ వంటి ఇతర ఉత్పత్తులను సైతం కంపెనీ విడుదల చేయనుందని స్మార్ట్‌రాన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ లింగారెడ్డి తెలిపారు. కాగా, వచ్చే నెల చివరివారంలో అందుబాటులోకి రానున్న టూ-ఇన్-వన్ పీసీ ధరను రూ.39,999గా నిర్ణయించింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications