సెక్స్ సీడీలతో సెక్రటరీ బ్లాక్ మెయిల్ : ఆప్ బహిష్కృత నేత
న్యూఢిల్లీ : ఆప్ మంత్రి సెక్స్ సీడీల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రేషన్ కార్డు ఇప్పిస్తానంటూ.. ఇంటికి పిలిచి తనను లోబర్చుకున్నాడని బాధిత మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆప్ బహిష్కృత నేత సందీప్ కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే.. సందీప్ కుమార్ సెక్స్ సీడీల లీకేజీ ఆయన పర్సనల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ నిర్వాకమే అన్న వార్తలు తెరపైకి వచ్చాయి. పోలీసు విచారణ ఎదుర్కొంటున్న సందీప్ కుమార్ కూడా తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. సెక్స్ సీడీలతో ప్రవీణ్ కుమార్ తనను బ్లాక్ మెయిల్ చేసినట్లు సందీప్ కుమార్ పోలీసులతో వెల్లడించినట్లు తెలుస్తోంది.

సందీప్ కుమార్ సెక్స్ సీడీలను లీక్ చేసి.. పలువురికి పంపిణీ చేసినట్లు ప్రవీణ్ కుమార్ పై ఆరోపణలు వస్తుండడంతో.. సోమవారం నాడు ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్, సందీప్ కుమార్ ఇద్దరు పోలీసులు కస్టడీలోనే ఉన్నారు.
కాగా, కేసులో తొలుత తనను సమర్థించుకునే ప్రయత్నం చేసిన సందీప్ కుమార్.. ఏకంగా బాధిత మహిళే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లొంగిపోక తప్పలేదు. 11 నెలల క్రితం రేషన్ కార్డు కోసం సందీప్ ఇంటికి వెళితే.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాను స్పృహ కోల్పోయాక అత్యాచారానికి ఒడిగట్టాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సందీప్ కుమార్ పై అత్యాచారం కేసు నమోదయింది. కోర్టు ఆదేశంతో మూడు రోజుల పాటు సందీప్ కస్టడీ కొనసాగుతోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications