వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాటియాలా కాళీ మందిరంలో అపవిత్రం చేసే యత్నం: నిందితుడి అరెస్ట్(వీడియో)

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పంజాబ్‌లోని పాటియాలాలోని చారిత్రాత్మకమైన కాళీ దేవాలయంలో సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రమాద ఘంటికలు మోగించే ప్రయత్నం జరిగింది. ఈ సంఘటన మధ్యాహ్నం జరిగిందని, రాజ్‌దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295-A, 354 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఆలయం పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు.

 Sacrilege Attempt in Patiala Kali Temple, video viral; accused arrested.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో కాళీమాత విగ్రహం ఉంచిన ఆవరణలోకి ముసుగు ధరించిన వ్యక్తి వెళ్లి.. విగ్రహాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించడం వైరల్‌గా మారింది. ఆ వ్యక్తిని పూజారి వెంటనే విగ్రహం నుంచి దూరంగా నెట్టాడు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ స్పందిస్తూ.. విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. "అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్‌లో కష్టపడి సంపాదించిన శాంతి, సామరస్యానికి భంగం కలిగించడం ద్వారా అసాంఘిక శక్తులు అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి" అని సీఎం అన్నారు, శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మత కేంద్రాలను రక్షించడంలో పంజాబీలు ఐక్యంగా ఉండాలని సీఎం చన్నీ కోరారు.

మరోవైపు ఈ ఘటనను ఖండించిన బీజేపీ, ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. బాదల్ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. "పాటియాలాలోని కాళీ మాత మందిరంలో జరిగిన అనుచిత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. హిందువులు, సిక్కుల పుణ్యక్షేత్రాల మధ్య మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి పంజాబ్ వెలుపలి శక్తులు కుట్ర పన్నాయని మేము భయపడి, హెచ్చరిస్తున్నాము. చెత్త భయాలు నిజమవుతాయి. శాంతి, మత సామరస్యాన్ని కాపాడేందుకు మనందరం వారికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందాం' అని పిలుపునిచ్చారు.

English summary
Sacrilege Attempt in Patiala Kali Temple, video viral; accused arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X