అమీర్ సినిమా ప్లాప్ చేయండి: ముస్లిం ముక్త్ భారత్ అంటూ సాధ్వి సంచలనం
న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ముస్లిం ముక్త్ భారత్'కు ఇదే సరైన సమయమని ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో 'కాంగ్రెస్ ముక్త్ భారత్' మిషన్ దాదాపు పూర్తి అయిందని, 'మస్లిం ముక్త్ భారత్'కు సమయం ఆసన్నమైందని సంచనల వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరోలు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్‌లపై కూడా ఆమె విరచుకుపడ్డారు. వారు పాకిస్థాన్ అనుకూలవాదులని వ్యాఖ్యానించారు. అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' చిత్రాన్ని ఫ్లాప్ చేయాలని హిందుస్థానీయులను ఆమె కోరారు. [లవ్ జిహాద్‌కు 'ఖాన్ త్రయం' ప్రోత్సాహం, వారి సినిమాలు చూడొద్దు: సాధ్వి]

షారూక్ ఖాన్ నటించిన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మట్టికరవడంతో ఇప్పుడు హిందూ జపం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది యూపీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ ప్రకటించినట్లయితే ఆ పార్టీ 300 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.
కాగా, గతంలో కూడా సాధ్వి ప్రాచీ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఖాన్‌ల సినిమాలు బాయ్‌కాట్ చేయాలని, జాతి వ్యతిరేక శక్తులను నిర్మూలించేందుకు వాటికి ఆశ్రయమిస్తున్న ముస్లిం విద్యా సంస్థలపై విచారణ జరపించాలని అప్పట్లో ఆమె డిమాండ్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications