Sadist: ఫస్ట్ భార్య ఆత్మహత్య, రెండో భార్య జంప్, కూతురితో డెత్ నోట్ రాపించి ఏం చేశాడంటే ?, ఫినిష్ !

ముంబాయి/నాగ్ పూర్: వివాహం చేసుకున్న భర్తకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాలకే రెండో భార్య లేచిపోయింది. ఇద్దరు కుమార్తెలు, పిల్లలతో కలిసి అతను నివాసం ఉంటున్నాడు. పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి పరిశీలిస్తే ఇంట్లో డెత్ నోట్ చిక్కింది. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి స్వయంగా డెత్ నోట్ రాసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే తండ్రి మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు.

ఆత్మహత్య చేసున్న భార్య

ఆత్మహత్య చేసున్న భార్య


మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోని కాలామ్నా ప్రాంతంలో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న రాజేష్ కు 16 ఏళ్ల, 12 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ గొడవల కారణంగా 2016లో రాజేష్ భార్య ఆత్మహత్య చేసుకుంది.

రెండో భార్య జంప్

రెండో భార్య జంప్

భార్య ఆత్మహత్య చేసుకోవడంతో రాజేష్ 2017లో వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. రాజేష్ ను వివాహం చేసుకున్న మహిళ అతనితో గొడవలు పడటం మొదలుపెట్టింది. 2021లో రాజేష్ భార్య లేచిపోయింది. ఇద్దరు కుమార్తెలు, పిల్లలతో కలిసి రాజేష్ అతని ఇంటిలో నివాసం ఉంటూ కూలి పని చేస్తున్నాడు.

కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పిన తండ్రి

కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పిన తండ్రి

ఈనెల 6వ తేదీన రాజేష్ పోలీసులకు ఫోన్ చేశాడు. తన పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుందని రాజేష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెళ్లి పరిశీలిస్తే రాజేష్ ఇంట్లో డెత్ నోట్ చిక్కింది. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి స్వయంగా డెత్ నోట్ రాసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 తండ్రి ఫోన్ లో కూతురు ఆత్మహత్య చేసుకుంటున్న ఫోటో

తండ్రి ఫోన్ లో కూతురు ఆత్మహత్య చేసుకుంటున్న ఫోటో


పోలీసులు ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి సవతి తల్లి, అవ్వా, తాత, చిన్నానను, తండ్రిని విచారణ చేశారు. రాజేష్ మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి స్టూల్ మీద నలబడి మెడకు తాడు వేలాడదీసిన సమయంలో ఆమె నవ్వుతూ ఉన్న సమయంలో ఆమె తండ్రి రాజేష్ అతని మొబైల్ లో ఫోటో తీశాడు.

రెండో భార్య మీద కసితో కూతురిని బలి చేశాడు

రెండో భార్య మీద కసితో కూతురిని బలి చేశాడు


రాజేష్ కు అతని రెండో భార్య, ఆమె కుటుంబ సభ్యుల మీద పగ ఉందని, అందుకే కూతురిని బలి చేశాడని పోలీసులు అన్నారు. నువ్వు నా ఆత్మహత్యకు చిన్నమ్మ, వాళ్ల బంధువులు కారణం అని లెటర్ రాయాలని, తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు డ్రామాలు ఆడాలని కూతురికి చెప్పి ఆమెతోనే డెత్ నోట్ రాపించాడు. తరువాత స్టూల్ మీద కూతురు నిలబడి ఉంటే ఆమె మెడకు రాజేష్ తాడు బిగించాడని, తరువాత ఫోటో తీశాడని పోలీసులు అన్నారు.

కూతుర్ని చంపేసి డ్రామాలు ఆడిన తండ్రి

కూతుర్ని చంపేసి డ్రామాలు ఆడిన తండ్రి


కూతురు స్టూల్ మీద నిలబడి ఉంటే కన్నతండ్రి రాజేష్ ఆ స్టూల్ ను తన్నేయడంతో అతని కళ్ల ముందే ఆమె ప్రాణం పోయిందని పోలీసులు చెప్పారు. కన్నతండ్రి స్కెచ్ తెలుసుకోలేని కూతురు స్వయంగా డెత్ నోట్ రాసి తండ్రి చేతిలోనే హత్యకు గురైయ్యిందని, నిందితుడిని అరెస్టు చేశామని నాగ్ పూర్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+