Sadist: కన్నకూతురిని తల్లిని చేసిన తండ్రి, ముగ్గురు బిడ్డలకు పెళ్లి చేచి మూడో కూతురిని !

అహమ్మదాబాద్/చెన్నై : ముగ్గురు బిడ్డలకు పెళ్లి చేశాడు. ఇంట్లో చిన్న కూతురు ఉంది. కామాంధుడైన కన్నతండ్రి కన్న కూతురిని లైంగిక వేదింపులకు గురి చేశాడు. ఒక సంవత్సరం నుంచి కూతురి మీద అత్యాచారం చెయ్యడంతో ఆమె గర్బవతి అయ్యింది. యువతి గర్బవతి అనే విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. యువతికి కడుపునొన్ని రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే ఇలాంటి పాడుపని ఎవరు చేశారు ? అని అందరూ ఆ యువతిని నిలదీశారు. తనకు పుట్టిన బిడ్డకు తండ్రి మా నాన్న అని ఆ యువతి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. తనతో కాపురం చేసిన తన భర్త కన్న కూతురితో కూడా కాపురం చేశాడని తెలుసుకున్న తల్లి ఆవేదనతో కుమిపోయి పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

Recommended Video

    Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.

     19 ఏళ్ల యువతి

    19 ఏళ్ల యువతి

    గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా షిహోర్ ప్రాంతంలోని మురికివాడల్లో రంజిత్ (పేరు మార్చడం జరిగింది) అనే కామాంధుడు ఉన్నాడు. రంజిత్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంజిత్ నాలుగవ కుమార్తెకు 19 ఏళ్ల వయసు ఉంది. రంజిత్ ఇద్దరు కుమారులు, పెద్ద కుమార్తెలకు వివాహాలు అయిపోయి వేర్వేరుగా కాపురం ఉంటున్నారు.

     భార్య లేనప్పుడు, అర్దరాత్రి కూతురి మీద రేప్

    భార్య లేనప్పుడు, అర్దరాత్రి కూతురి మీద రేప్

    రంజిత్ అతని భార్య, చిన్న కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో రంజిత్ అతని కుమార్తెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. రానురాను ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తె మీద అత్యాచారం చేశాడు. అర్దరాత్రి భార్య నిద్రపోతున్న సమయంలో కుమార్తె మీద అత్యాచారం చెయ్యడం మొదలుపెట్టాడు.

     9 నెలలు బయటకు రాలేదు

    9 నెలలు బయటకు రాలేదు

    నీ మీద అత్యాచారం చేసిన విషయం బయటకు తెలిస్తే నిన్ను, మీ అమ్మాను చంపేస్తానని రంజిత్ ఆమె కుమార్తెను బెదిరించాడు కుమార్తెకు ఎక్కువ కడుపునొన్ని రావడం, కడుపు ఎత్తుగా ఉండటంతో ఆమె తల్లికి అనుమానం వచ్చి షిహోర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్బవతి అని చెప్పారు. కొన్ని రోజులకే ఆ యువతి బిడ్డకు జన్మనిచ్చింది.

     నా తండ్రే కామాంధుడు

    నా తండ్రే కామాంధుడు

    పెళ్లి కాకుండానే నిన్ను తల్లిని చేసింది ఎవరు అంటూ ఆ యువతిని తల్లితో పాటు బంధువులు ప్రశ్నించారు. తనకు పుట్టిన బిడ్డకు తన తండ్రి కారణం అని ఆ యువతి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. తల్లి, బిడ్డను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. కన్న కూతురిని తల్లిని చేసి బిడ్డను పుట్టించిన కామాంధుడి కోసం షిహోర్ పోలీసులు గాలిస్తున్నారని అహమ్మదాబాద్ మిర్రన్ పత్రిక కథనం ప్రచురించింది. కన్న కూతురిని సొంత తండ్రి తల్లిని చేశాడని వెలుగు చూడటం గుజరాత్ లో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+