15ఏళ్ల బాలికపై సాధువు అత్యాచారం, అరెస్ట్
లక్నో: 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారం చేసిన కేసులో ఓ సాధువుని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలో చోటు చేసుకున్న ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.
మహారాష్ట్రలో అహ్మాద్ నగర్‌కు చెందిన ఆనంద దాస్ అలియాస్ సంజీవ్ శర్మ నవంబర్ 3వ తేదీన బాలికను కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికను మహారాష్ట్రలోని ఓ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి, చాలా రోజుల పాటు తనపై అత్యాచారం చేశాడని బాలిక తెలిపింది.

సాధువు బారి నుంచి బాలికను పోలీసులు ఆదివారం విడిపించారు. దీంతో అతడిపై సెక్షన్ 363 (కిడ్నాప్), 376(అత్యాచారం) పోస్కో (లైంగిక నేరాల నుంచి బాలికలకు రక్షణ) చట్టాల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications