హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీపై సల్మాన్: అసద్ దార్లో మత గురువులు జయహో

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని పొగడటం బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు చిక్కులు తెచ్చి పెడుతున్న విషయం తెలిసిందే. ఇన్ని ఇక్కట్లు వస్తాయని సల్మాన్ ఊహించక పోయి ఉండవచ్చు! సల్మాన్ జయహో చిత్రాన్ని బహిష్కరించాలని ఇప్పటికే మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. మరికొందరు ముస్లిం నేతలు కూడా అదే దారిలో నడుస్తున్నారు.

జయహో చిత్రం ఎన్నో రికార్డులు సృష్టిస్తుందని సల్మన్ ఖాన్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సంక్రాంతి పర్వదినం సందర్భంగా అహ్మదాబాదులో మోడీని కలిసిన సల్మాన్ ఖాన్ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. 2002 గుజరాత్ అల్లర్లపై మోడీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు.

Salman Khan

ఆయన వ్యాఖ్యలపై పలు ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ సభ్యులు, బెండీ బజార్ మసీద్ ఇమామ్ అయిన మౌలానా ఇజాజ్ కశ్మీరి మాట్లాడుతూ... గోద్రా అల్లర్ల పైన మోడీ క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదని సల్మాన్ చెప్పడం రెచ్చగొట్టే విధంగా, బాధాకరమైనవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

సల్మాన్ చేసిన ఆ వ్యాఖ్యలు తమ సెంటిమెంటును దెబ్బతీశాయని, అందుకే ముస్లిం కమ్యూనిటీకి ఆయన చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చామని చెప్పారు. తన వ్యాఖ్యలపై సల్మాన్ క్షమాపణలు చెప్పే వరకు తాము భవిష్యత్తులో కూడా ఆయన చిత్రాలను బహిష్కరిస్తామన్నారు.

English summary

 Bollywood actor Salman Khan might not have imagined that his one statement on Narendra Modi would bring so much trouble for him. Now, a few Muslim clerics asked their followers to boycott Salman's recently released movie 'Jai Ho".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X