అనుమానాలు: ఉరివేసుకున్న ఎస్‌పి నాయకుడి కోడలు
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యశోదానగర్‌లో విషాదం అలుముకుంది. సమాజ్‌వాది పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడి కోడలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
సమాజ్‌వాది పార్టీ నేత, యుపి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు ఆత్మ ప్రకాష్ శుక్లా కోడలు అనిత శుక్రవారం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, అనిత కుటుంబ సభ్యులు మాత్రం తమ కూతురుది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆరోపించారు. అనిత భర్త నివేంద్రపై నౌబస్టా పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు వారు ఫిర్యాదు చేశారు.

తన సోదరి మృతిలో ఆమె భర్త నివేంద్ర హస్తముందని, కుట్రలో భాగంగానే హత్య చేసి ఉంటారని అనిత సోదరుడు కమలేష్ ఆరోపించారు. అనితతో నివేంద్ర ఎప్పుడూ ఘర్షణ పడుతుండేవాడని, వాగ్వాదం చేస్తుండేవాడని కమలేష్ పోలీసులకు తెలిపాడు.
పోస్టుమార్టం నిమిత్తం అనిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఉరివేసుకోవడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కాగా, పోలీసులు తదుపరి విచారణను కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications