ప్రతి విధ్యార్థికి స్మార్ట్ ఫోన్, కోటిమందికి వెయ్యి రూపాయాల పెన్షన్లు
ఉచిత హమీలతో సమాజ్ వాదీపార్టీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. దక్షిణాది తరహలో పార్టీలు గుప్పించినట్టుగానే ఉచిత హమీలను సమాజ్ వాదీ పార్టీ ప్రజలకు ఇచ్చింది.
లక్నో:ఉచిత పథకాలకు సమాజ్ వాదీ పార్టీ తెరతీసింది. దక్షిణాదిలోని తమిళనాడు తరహలోనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ మ్యానిఫెస్టోను విడుదలచేసింది సమాజ్ వాదీ పార్టీ.బిపిఎల్ పరధిలోని ప్రజలకు ఉచితంగా మెడికల్ సౌకర్యాలు, విధ్యార్థులకు ఉచితంగా ల్యాప్ ట్యాప్ లు, మహిళలకు ఫ్రెషర్ కుక్కర్లు, ఉచితంగా బియ్యం, గోధుమలను ఇవ్వనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఉచిత హమీలను గుప్పించాడు అఖిలేష్ యాదవ్.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో మరోసారి అదికారాన్ని నిలబెట్టుకొనేందుకు సమాజ్ వాదీ పార్టీ వ్యూహరచన చేస్తోంది.
మహిళలు, యువత లక్ష్యంగా అఖిలేష్ యాదవ్ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించాడు. ఉచిత హమీలకు పెద్దపీట వేశాడు.

ఉచిత హమీలకు పెద్దపీట వేసిన అఖిలేష్ యాదవ్.
దక్షిణాది రాష్ట్రాల్లో తరహలోనే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఉచిత హమీల వరద పారేలా కన్పిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ ఆదివారం నాడు తన మ్యానిఫెస్టోలో ఉచిత హమీలకు ప్రాధాన్యత ఇచ్చింది.మహిళకు ఉచితంగా ఫ్రెషర్ కుక్కర్లు, ఉచితంగా గోధుమలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది ఎస్ పి. విధ్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను ప్రకటించింది.ప్రతి ఏటా లక్షన్నరలోపుగా ఆదాయం ఉన్న కుటుంబాలకు ఉచితంగా వైద్యసౌకర్యాలను కల్పించనున్నట్టు ప్రకటించింది.బిపిఎల్ కుటుంబాలకు చెందిన చిన్నారులకు ప్రతి నెలా కిలో నెయ్యితో పాటు పాల పౌడర్ ను ఇవ్వనున్నట్టు ప్రకటించాడు అఖిలేష్ యాదవ్.

రైతుల కోసం ప్రత్యేకనిధిఏర్పాటు
రైతాంగం సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం చేయడం కష్టంగా మారినందున రైతాంగంకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కిసాన్ కోశ్ పేరుతో రైతుల సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

మహిళలకు వరాలు కురిపించిన అఖిలేష్
మహిళలను లక్ష్యంగా చేసుకొని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వరాలజల్లు కురిపించారు. మహిళలను ఆకట్టుకొనేలా మ్యానిఫెస్టోలో వరాలుకురిపించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టిక్కెట్టుపై యాభై శాతం రాయితీని ప్రకటించాడు.వృద్దాప్యంలో ఉన్న వారికి ప్రత్యేకంగా వృద్దాశ్రమాలను ఏర్పాటు చేస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.ప్రతి గ్రామాన్ని విద్యుద్దీకరిస్తామని అఖిలేష్ ప్రకటించాడు.కోటి మందికి ప్రతి నెలా వెయ్యి రూపాయాల పెన్షన్ ఇస్తామని ప్రకటించాడు.మహిళలకు వరాలు కురిపించిన అఖిలేష్
మహిళలకు వరాలు కురిపించిన అఖిలేష్
మహిళలను లక్ష్యంగా చేసుకొని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వరాలజల్లు కురిపించారు. మహిళలను ఆకట్టుకొనేలా మ్యానిఫెస్టోలో వరాలుకురిపించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టిక్కెట్టుపై యాభై శాతం రాయితీని ప్రకటించాడు.వృద్దాప్యంలో ఉన్న వారికి ప్రత్యేకంగా వృద్దాశ్రమాలను ఏర్పాటు చేస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.ప్రతి గ్రామాన్ని విద్యుద్దీకరిస్తామని అఖిలేష్ ప్రకటించాడు.కోటి మందికి ప్రతి నెలా వెయ్యి రూపాయాల పెన్షన్ ఇస్తామని ప్రకటించాడు.

విధ్యార్థులు, యువత లక్ష్యంగా సమాజ్ వాదీ ల మద్య పొత్తు
విధ్యార్థులు, యువత లక్ష్యంగా సమాజ్ వాదీ తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ ను ఇస్తామని ఎస్ పి చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ప్రతి గల్లీకి ల్యాప్ టాప్ ను ఇస్తామన్నారు. బిపిఎల్ పరిధిలోని విద్యార్థులు ప్రాథమికపాఠశాలలో చదువుతోంటే వారి కోసం నెయ్యి, పాల పౌడర్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు

మూడు వందల స్థానాలకుపైగా గెలుస్తాం
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి మూడు వందలకు పైగా స్థానాలను కైవసం చేసుకొంటుందని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ,ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.తమ కూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమ విజయావకాశాలు మరింత మెరుగయ్యాయని ఆయన చెప్పారు.

అభివృద్దిని చూసి ఓటెయాలని వినతి
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి అభివృద్దిని చూసి ఓటేయాలని సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ చేసిన సేవలను చూసి ఓటేయాలని కోరారు. రాజకీయ సెక్యులరిజం కోసం, సోషలిజం కోసం ఎస్ పి కి ఓటేయాలని ఆయన కోరారు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ళపాటు అనేక అభివృద్ది కార్యక్రమాలను కొనసాగించామన్నారు.ఈ కార్యక్రమాలను కొనసాగాలంటే సమాజ్ వాదీకే ఓటేయాలని కోరారు.

కాంగ్రెస్ కోటలో ఏడు స్థానాల్లో ఎస్ పి పోటీ
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ, రాయ్ బరేలీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ కు పెట్టని కోటలు. ఈ స్థానాల నుండే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అయితే ఈ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో 14 అసెంబ్లీ స్థానాలుంటాయి.అయితే ఈ స్థానాల పరిధిలో సుమారు పది అసెంబ్లీ స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ పోటీచేయనుంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ చర్చిస్తోంది. మరో వైపు యూపిపై రాహుల్ కు మంచి పట్టుందని అఖిలేష్ అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications