drugs case లో షాకింగ్ ట్విస్ట్ లు: నకిలీ పత్రాలతో సమీర్ వాంఖడే ఉద్యోగం; మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలనం
షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌సిబి అధికారి సమీర్ వాంఖడే ను మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సమీర్ వాంఖడే ముస్లిం అని ఉద్యోగం కోసం నకిలీ పత్రాలను ఉపయోగించి అర్హులైన దళితుడి ఉద్యోగాన్ని లాగేసుకున్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణలు చేశారు.

తప్పుడు ధృవపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన సమీర్ వాంఖడే : నవాబ్ మాలిక్ ఆరోపణ
తాను ట్వీట్ చేసిన జనన ధృవీకరణ పత్రం అసలైనదని పేర్కొన్నారు నవాబ్ మాలిక్ . సమీర్ వాంఖడే తండ్రి జ్ఞానదేవ్ వాంఖడే ఇస్లాంలోకి మారారని పేర్కొన్నారు. కానీ వాంఖడేకు ఉద్యోగం కోసం దళిత సర్టిఫికేట్‌ను ఉపయోగించాడని మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఒక అర్హులైన దళితుడి ఉద్యోగాన్ని వాంఖడే లాక్కున్నాడు అని నవాబ్ మాలిక్ విలేకరుల సమావేశంలో అన్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం సంపాదించాడని ఆరోపించారు. నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడే యొక్క జనన ధృవీకరణ పత్రాన్ని బహిర్గతం చేసి, వాంఖడే నకిలీ పత్రాలను రూపొందించాడని ఆరోపించాడు.

తన పేరు దావూద్ కాదన్న సమీర్ వాంఖడే తండ్రి
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తండ్రి తన కొడుకుపై , తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానంగా అతని పేరు జ్ఞానదేవ్ అని, ఎన్‌సిపి నాయకుడు మరియు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పేర్కొన్నట్లు దావూద్ కాదు అని తెలిపారు. తన కొడుకు మహాభారత ఇతిహాసం నుండి శత్రువులతో చుట్టుముట్టబడిన అభిమన్యు లాంటివాడని, అయితే అతను ఈ ''చక్రవ్యూహం'' (శత్రువులను చుట్టుముట్టే సైనిక పునాది) నుండి అర్జునుడు లాగా బయటకు వస్తాడని చెప్పాడు.

సమీర్ వాంఖడే ముస్లిం అన్న ఆరోపణకు సమీర్ వాంఖడే తండ్రి సమాధానం
సమీర్ వాంఖడే పుట్టుకతో ముస్లిం అని, అతని అసలు పేరు ''సమీర్ దావూద్ వాంఖడే'' అని పేర్కొన్న మంత్రి నవాబ్ మాలిక్‌పై జ్ఞాన దేవ్ వాంఖడే మాట్లాడుతూ, నవాబ్ మాలిక్ చాలా చీప్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన పేరు దావూద్ వాంఖడే అనేది అబద్ధమని, సమీర్ వాంఖడే యొక్క జనన ధృవీకరణ పత్రాన్ని విడుదల చేయడం, మా పరువు తీయడం వెనుక మంత్రి నవాబ్ మాలిక్ యొక్క ఏదో దుర్మార్గపు ఉద్దేశ్యం ఉందని తాను భావిస్తున్నానని వెల్లడించారు. నా పేరు నా పుట్టినప్పటి నుంచి జ్ఞాన్‌దేవ్ వాంఖడే ఇప్పటికీ అలాగే ఉందని ఆయన పేర్కొన్నారు.

తన పేరు జ్ఞాన దేవ్ వాంఖడే అని చెప్పిన సమీర్ వాంఖడే తండ్రి , బర్త్ సర్టిఫికెట్ పై అనుమానం వ్యక్తం
తాను గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసానని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలో కూడా పనిచేశానని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తన పేరు దావూద్ అయితే, తాను చదువుకున్నప్పటినుంచి ప్రభుత్వ శాఖలో పనిచేసిన ఈ సమయంలో ఎవరికీ నా పేరు జ్ఞాన్‌దేవ్ కాదని దావూద్ అని తెలియకపోవడం ఎలా సాధ్యమవుతుంది? అంటూ ప్రశ్నించారు. నవాబ్ మాలిక్‌కు మాత్రమే సమీర్ వాంఖడే కు సంబంధించిన జనన ధ్రువీకరణ అనుమానాస్పద పత్రం ఎలా వచ్చింది? దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆయన అన్నారు.

సమీర్ వాంఖడే తల్లి ముస్లిం, తండ్రి హిందూ
సమీర్ వాంఖడే తన తండ్రి జ్ఞాన్‌దేవ్ వాంఖడే జూన్ 2007లో పూణేలోని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పదవీ విరమణ చేశారని పేర్కొన్నాడు. వాంఖడే తండ్రి హిందువు మరియు అతని దివంగత తల్లి జహీదా ముస్లిం అని వాంఖడే తెలిపారు. సమీర్ వాంఖడే తాను 2006లో డాక్టర్ షబానా ఖురేషీని ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లాడినట్లు పేర్కొన్నాడు. వారిద్దరూ 2016లో సివిల్ కోర్టు ద్వారా పరస్పరం విడాకులు తీసుకున్నారు. తర్వాత, 2017లో క్రాంతి రెడ్కర్‌ను వివాహం చేసుకున్నాడు.
Recommended Video

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో 25 కోట్ల డీల్ ఆరోపణలతో సమీర్ వాంఖడే ను టార్గెట్ చేసిన మహా మంత్రి
ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ క్సులో సాక్షి ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ లో ఆర్యన్ ఖాన్ ను ఈ కేసు నుండి తప్పించటానికి ఎన్సీబీ అధికారులు 25 కోట్ల రూపాయల డీల్ మాట్లాడారని చెప్పటంతో సమీర్ వాంఖడే అవినీతి అధికారి అని, దీంతో సమీర్ వాంఖడే వ్యక్తిగత జీవితాన్ని డ్రగ్స్ కేసుతో లింక్ పెట్టి సంచలన ఆరోపణలు చేస్తున్నారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications