వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసు: అసీమానందతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు

|
Google Oneindia TeluguNews

పంచకుల: సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఇప్పటి వరకు నిందితులుగా ఉన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ హర్యానాలోని పంచకులా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అసీమానంద్ స్వామి కూడా ఉన్నారు. ఇక ఈయనతో పాటు నిర్దోషులుగా కోర్టు ప్రకటించిన వారిలో లోకేష్ శర్మ, కమల్, చౌహాన్, రాజిందర్ చౌదరిలు ఉన్నారు. వీరందరిని పంచకులలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.

మా వృత్తిని గౌరవించండి... మీ గొడవల్లోకి లాగొద్దు ప్లీజ్: 'చౌకీదార్' వివాదంపై వాచ్‌మెన్లు <br>మా వృత్తిని గౌరవించండి... మీ గొడవల్లోకి లాగొద్దు ప్లీజ్: 'చౌకీదార్' వివాదంపై వాచ్‌మెన్లు

ఫిబ్రవరి 18, 2007లో హర్యానాలోని పానిపట్‌కు సమీపంలో ఉన్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 68 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో అధికంగా పాకిస్తాన్ జాతీయులు ఉండగా భారత రైల్వే అధికారులు నలుగురు మృతి చెందారు. ఓ బోగీలో బాంబు పేలడంతో ఈ ఘటన జరిగింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ అమృత్‌సర్‌లోని అటారీకి వెళుతున్న సమయంలో పేలుడు సంభవించింది.

Samjhauta Express blast case: Assemanand among 4 acquitted by special NIA court

2010 జూలైలో కేసును జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేయడం జరిగింది. విచారణ చేసిన ఎన్ఐఏ 2011 జూన్‌లో చార్జిషీటు దాఖలు చేసింది. ఎనిమిది మందిపై ఛార్జిషీటు వేసింది. ఈ కేసులో మొత్తం 200కు పైగా సాక్షులను విచారణ చేసింది ఎన్ఐఏ. ఇక ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ విచారణ పేరుతో పాక్ దేశస్తుల నుంచి సేకరించిన వాంగ్మూలాలను రద్దు చేయాలని కోరుతూ మార్చి 11న పాకిస్తాన్లో నివాసం ఉండే రాహిలా వకీల్ అనే వ్యక్తి అడ్వకేట్ మోమిన్ మాలిక్ ద్వారా అనుమతి కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే ఈ దరఖాస్తును కోర్టు తోసి పుచ్చింది.

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ కేసుకు సంబంధించి సాక్షాధారాలను కోర్టు ముందుంచడంలో ఎన్‌ఐఏ విఫలమైందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం నిర్దోషులను విడుదల చేస్తూ తీర్పు వెలువరించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీరందరినీ విడుదల చేయడం జరిగిందని ఎన్ఐఏ తరపున న్యాయవాది ఆర్కే హందా తెలిపారు.

English summary
All four accused in the Samjhauta blast case, including godman Aseemanand, have been acquitted by a court in Panchkula, Haryana. The three other people who have been acquitted are: Lokesh Sharma, Kamal Chauhan and Rajinder Chaudhary. They have been acquitted by a special NIA court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X