మహిళా ఎస్ఐపై ఇసుక మాఫియా దాడి, తాజ్‌మహల్ దగ్గర వైఫై సేవలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఇసుక మాఫియా మహిళా ఇన్స్‌పెక్టర్‌పై దాడి చేసి గాయపరిచింది. ఈ సంఘటన షాజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నేవాజ్ నది ఒడ్డున ఇసుక అక్రమ త్రవ్వకాల దందా గత కొన్నాళ్లుగా కొనసాగుతుంది.
దీనికి సంబంధించి ముఖ్యమంత్రి హెల్ లైన్ నెంబర్‌కు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గనుల శాఖ ఇన్‌స్పెక్టర్ రీనా పాథక్ షాజాపూర్‌లో సోదాలు నిర్వహించారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశారు.
దీంతో ట్రాక్టర్ల డ్రైవర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత ట్రాక్టర్ల డ్రైవర్లు 25 మంది మద్దతుదారులతో తిరిగి వచ్చారు. వారంతా కలిసి ఇన్స్‌పెక్టర్ రీనా పాథక్, హోంగార్డులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు ధ్వంసం అయింది.

ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ రీనా పాథక్ మాట్లాడుతూ ఇసుక అక్రమ త్రవ్వకాల దందాను చెక్ చేసేందుకు నది ఒడ్డుకు చేరుకున్నామని అన్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసిన తర్వాత కొంత మంది పురుషులు, మహిళలు మాపై దాడి చేశారని చెప్పారు.
దీంతో గాయపడిన తామంతా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వచ్చామని తెలిపారు. ఈ సంఘటనలో 21 మంది పురుషులను, 4 గురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2012లో కూడా ఇసుక మాఫియా ఐపీఎస్ అధికారి నరేంద్ర కుమార్‌పై ఈ తరహా దాడే చేశారు.
జూన్ 16 నుంచి తాజ్‌మహల్ దగ్గర వైఫై సేవలు
జూన్ 16 నుంచి భారతదేశ పర్యాటక ప్రదేశం తాజ్‌మహల్ దగ్గర వైపై సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ తాజ్‌మహల్ చుట్టుపక్కల 21 వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటు చేయనుంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి వారణాసిలోని గంగా ఘాట్ల దగ్గర వైఫై సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోని 25 పురావస్తు ప్రాధాన్య ప్రదేశాల్లోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications