నాతో మాట్లాడిన మోడీ, జ్ఞాపకశక్తి అద్భుతం: సానియా

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం చాలా గొప్ప అనుభూతినిచ్చిందని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తెలిపింది. తన అకాడమీ గురించి మోడీ ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పింది. యుఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా శుక్రవారం ప్రధానిని కలిసిన సంగతి తెలిసిందే.

ప్రధాని నుంచి ఆహ్వానం అందడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని సానియా తెలిపింది. "ప్రధానిని కలవడం గొప్ప అనుభూతి. యుఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ టైటిల్ గెలిచాక నాకు అభినందన సందేశం పంపారు. అందుకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపా. ప్రధాని మోడీ గారి జ్ఞాపకశక్తి అధ్బుతం. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చెల్లి ఆనమ్ అహ్మాదాబాద్‌లో షూటింగ్ పోటీల్లో పొల్గోన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని కలిసింది. ఆనమ్‌ను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. తన గురించి వాకబు చేశారు" అని సానియా మిర్జా చెప్పింది.

"తీరికలేని షెడ్యూల్ లోనూ ప్రధాని నాకు సమయమివ్వడం గొప్పగా అనిపిస్తుంది. ఆయన చాలా సావధానంగా నాతో మాట్లాడారు. టైటిల్ గెలిచినందుకు అభినందించారు" అని వివరించింది. ప్రధానితో భేటీలో సానియా మీర్జాతో పాటు ఆమె తల్లి నసీమా మీర్జా కూడా పాల్గొన్నారు. భారత టెన్నిస్ క్రీడాకారిణి, 2014 యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేత సానియా మీర్జా ప్రధానిని కలిశారని పిఐబి ప్రకటన వెలువరించింది.

Sania Mirza meets PM Narendra Modi after US Open victory
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+