సంజయ్ రిలీజ్: నేలను ముద్దాడి, ఫ్యాన్స్‌తో ఓ మాట

పుణే: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ గురువారం ఉదయం పుణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. 1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న ఆయన ఇప్పటి వరకు 42 నెలలపాటు జైల్లో ఉన్నారు.

జైలులో సంజయ్‌దత్‌ సత్ప్రవర్తనను గుర్తించిన ప్రభుత్వం ఇటీవల ఆయన శిక్షా కాలాన్ని తగ్గించింది. దీంతో ఆయన ఎనిమిది నెలలు ముందుగానే జైలు నుంచి విడుదలయ్యారు. ఉదయం జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్ దత్.. అభిమానుల నినాదాల మధ్య ఓ పెద్ద బ్యాగును భుజాన తగిలించుకుని, చేతిలో కొన్ని ఫైళ్లతో బయటకు వచ్చారు.

 Sanjay Dutt Walks Out Of Pune's Yerwada Jail With A Salute

తలుపులు తెరుచుకోగానే బయటికొచ్చిన ఆయన, బ్యాగును పక్కనబెట్టి నేలను ముద్దాదాడు. ఆపై జైలు వైపు తిరిగి, పైన ఎగురుతున్న జాతీయ పతాకానికి సెల్యూట్ చేశాడు. నిర్మాత రాజ్ కుమార్ హిరానీ ఆయన్ను విమానాశ్రయానికి తీసుకెళ్లారు.

వాస్తవానికి ఆయన పది గంటల సమయంలో విడుదల కావాల్సి ఉంది. సెక్యూరిటీ సమస్యల కారణంగా రెండు గంటల ముందుగానే బయటకు పంపినట్టుగా తెలుస్తోంది. జైలు బయట అభిమానులతో మాట్లాడుతూ.. మీ మద్దతు కారణంగానే బయటపడ్డానని ఒక మాట చెప్పి వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+