నా బర్రెల పాలతో స్నానం చేశారు: రాంపాల్‌పై ఆజంఖాన్
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత మరోసారి విచిత్రకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త, హత్య కేసులో అరెస్ట్ అయిన బాబా రాంపాల్‌పై కావడం గమనార్హం. ఇంతకీ ఆయన ఏం వ్యాఖ్యలు చేశారంటే.. రాంపాల్ శిశ్యులు తన బర్రెల పాలను ప్రతీరోజూ తీసుకెళ్లి.. అతనికి స్నానం చేయించేవారని అజాంఖాన్ తెలిపారు.
‘నేను వ్యక్తిగతంగా ఆ ఆశ్రమానికి పాలను సరఫరా చేశాను. ఆ పాలతోనే బాబా రాంపాల్‌కు ఆయన శిశ్యులు స్నానం చేయించారు. అంతేగాక ఆ పాలతోనే పాయసం చేసి ఆయన భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు' అని అజాంఖాన్ తెలిపారు.

అంతేగాక బాబా రాంపాల్‌కు భారీ ప్రాచుర్యం లభించడానికి కూడా తన బర్రెల పాలే కారణమని మంత్రి అజాంఖాన్ చెప్పారు. తన బర్రెల పాలతోనే రాంపాల్ ఆశ్రమానికి భారీ ఎత్తున విరాళాలు వచ్చాయని కూడా చెప్పారు. ఇంకా చెప్పాలంటే, బాబా రాంపాల్ తన బర్రెల ఆస్తి అని అజాంఖాన్ అన్నారు.
ఇదంతా ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను సరైన సమయంలో వేచి చూశానని, అది ఇప్పుడు రావడం వల్లే ఈ విషయాలు వెల్లడించానని తెలిపారు.












Click it and Unblock the Notifications