Santosh Gangwar : కేంద్రమంత్రిగా తప్పుకునే చివరి క్షణంలో EPFOలో 120 బదిలీలు
కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న సంతోష్ గంగ్వార్ ను తాజాగా కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా కర్నాటక గవర్నర్ గా పంపారు. అయితే ఆయన తన పదవి వదులుకోవడానికి కొద్ది గంటల ముందు కేంద్ర కార్మిక రాజ్య సంస్ధ (ఈపీఎఫ్ వో)లో భారీగా బదిలీలు చేపట్టడం వివాదాస్పదవుతోంది.
కేంద్రమంత్రి పదవి వదులుకుని కర్నాటక గవర్నర్ గా వెళ్లాలని సంతోష్ గంగ్వార్ కు ఆదేశాలు వచ్చిన రోజే ఆయన ఈవీఎఫ్ వో లో 120 మంది ఉన్నతాధికారుల్ని బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకునే వేళ అంత హడావిడిగా సంతోష్ గంగ్వార్ ఈ బదిలీలు ఎందుకు చేశారన్న దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. అయితే బదిలీ చేసిన అధికారులందరినీ వెంటనే కొత్త విధుల్లోకి చేరాలని కూడా ఆదేశాల్లో పేర్కొనడం వివాదంగా మారింది.

Recommended Video
సంతోష్ గంగ్వార్ స్ధానంలో కొత్త కార్మికశాఖ మంత్రిగా భూపేందర్ యాదవ్ ను మోడీ కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే యాదవ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేసి సదరు అధికారుల్ని విధుల్లో చేరేలా చూడాలని సంతోష్ గంగ్వార్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ బదిలీల ప్రక్రియలో అడగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగిదంటూ ఈపీఎఫ్ అధికారుల సంఘం సంస్ధ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటికొచ్చింది. ఈ బదిలీలు 2016లో అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్ వో నిబంధనల ప్రకారం కానీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కానీ లేవని అధికారులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications