వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్దార్ పటేల్ ముస్లిం వ్యతిరేకి కాదు: ఎల్‌కె అద్వానీ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సర్దార్ పటేల్ ముస్లిం వ్యతిరేకి కాదని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు. సర్దార్ పటేల్ ముస్లిం వ్యతిరేకి అనే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సర్దార్ పటేల్‌పై పరిశోధన చేసిన ఇస్లామిక్ పండితుడు, కాంగ్రెసు నాయకుడు రఫీక్ జకారియా ఆయన లౌకికవాదంపై సందేహాలు వ్యక్తం చేయడాన్ని అద్వానీ తప్పు పట్టారు

ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన ముందుమాట వ్యాసం పట్ల తన బ్లాగ్‌లో అద్వానీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్‌ను మతతత్వవాదిగా, జవహర్‌లాల్ నెహ్రూను లౌకికవాదిగా చూపించేందుకు ఆ వ్యాసం ప్రయత్నించిందని ఆయన అన్నారు.

Advani

అందుకే సంఘ్ పరివార్ సర్దార్ పటేల్‌ను పూజిస్తోందని, నెహ్రూను ద్వేషిస్తోందని ఆ వ్యాసంలో ఉంది. జకారియా అభిప్రాయాన్ని అద్వానీ ఖండించారు. జకారియా చేసిన ప్రసంగాలతో అచ్చయిన సర్దార్ పటేల్ అండ్ ఇండియన్ ముస్లిమ్స్ అనే పుస్తకంలోని విషయాలను ఉటంకిస్తూ జకారియా కూడా పటేల్ ముస్లింలను ఇష్టపడలేదనే అభిప్రాయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.

తాను పరిశోధన చేస్తూ పోతున్నకొద్దీ క్కమనిషిని చాలా విషయాల్లో సరిగా అర్థం చేసుకోలేదనే విషయంతో ఏకీభవిస్తూ వచ్చానని, భారత ముస్లింల పట్ల సర్దార్ పటేల్ తీరుపై చాలా పొరలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని, తాను ఆ విషయంలో సంతృప్తికరంగా పనిచేశానని అనుకుంటున్నానని జకారియా రాసిన వాక్యాలను అద్వానీ ఉటంకించారు.

English summary
BJP leader LK Advani on Tuesday contested allegations that Sardar Patel was anti-Muslim and quoted Rafiq Zakaria, an Islamic scholar and Congress leader, who had done research on the 'Iron Man', to underline his nationalistic credentials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X