హెలికాప్టర్‌లో రాక.. సర్పంచ్‌గా గెలిచి, ఎక్కడ, ఎవరు అంటే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రముఖులు/ పారిశ్రామిక వేత్తలు ఇందుకు మినహాయింపేం కాదు. అలా మహారాష్ట్రలో కూడా ఓ పారిశ్రామిక వేత్త పోటీ చేసి గెలుపొందారు. ఇక ప్రమాణ స్వీకారం చేయాల్సిన సమయం వచ్చింది. ఇంకేముంది అసలే బిజినెస్ మెన్ కావడంతో.. మామూలుగా రావాలని అనుకోలేదు. అందుకోసం కొత్తరకంగా ఆలోచించాడు.
ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మందీమార్బలంతో, డప్పు చప్పుళ్లతో, బాణసంచా కాలుస్తూ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. కానీ మహారాష్ట్రలో పారిశ్రామిక వేత్త జలింగర్ గగరె మాత్రం ఏకంగా హెలికాప్టర్ లో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. జలిందర్ గగరె పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. అహ్మద్ నగర్ తాలూకాలో గల అంబీ దుమాలాలో సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. పారిశ్రామికవేత్త కావడంతో పుణెలో ఉంటారు. గెలుపొందిన తర్వాత ప్రమాణస్వీకారం చేసే రోజు రానే వచ్చింది.

పుణె నుంచి వచ్చేందుకు కొత్తగా ఆలోచించాడు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు గ్రామంలో గల ఆలయాలపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసమే తాను సర్పంచ్‌గా పోటీ చేశానని జలిందర్ చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications