వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెచ్చెలి ‘చిన్నమ్మ చిరునవ్వు’మాయం: ఇప్పుడు ఏం చేద్దాం ?

శశికళకు షాక్ మీద షాక్ తగలడంతో ఆమె వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నీ రోజులు ఉన్న పరిస్థితి ఒక్క సారిగా తారుమారు కావడంతో చిన్నమ్మ ముఖంలో చిరునవ్వు మాయం అయ్యింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: శశికళను ఎలాగైనా తమిళనాడు సీఎం చెయ్యాలని, అందుకు అడ్డు వచ్చే వారిని ఎలాగైనా నిలువరించాలని చిన్నమ్మ వర్గీయులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమైనా సరే తాము అనుకున్నది చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

అజిత్ దెబ్బ: చేతులు ఎత్తేసిన హీరో, నేనురాను, శశికళకు షాక్

మంగళవారం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతుగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లక్సీలలో జయలలిత, పన్నీర్ సెల్వం ఫోటోలు మాత్రం పెట్లారు. డిసెంబర్ 29వ తేది దగ్గర పడుతున్న సమయంలో రెండు వర్గాలలోని కొందరు నాయకులు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు.

Sasikal to be AIADMK’s general secretary after Jayalalithaa ?

అయితే పన్నీర్ సెల్వం వర్గీయులు మాత్రం మనకు ఏం భయం లేదులే అంటూ ఏ విషయాన్ని వారు పెద్దగా పట్టించుకోకుండా వారిపని వారు చేసుకుని వెలుతున్నారు. శశికళను సీఎం చేస్తాం అని బహిరంగంగా మీడియా ముందు చెప్పిన మంత్రులు మాత్రం ఇప్పుడు ఎదురౌతున్న పరిస్థితులు చూసి ఆందోళన చెందుతున్నారు.

సీన్ రివర్స్: శశికళకు చుక్కలు చూపిస్తున్న అనుచరులు !

ఏది ఏమైనా సరే మనం శశికళకు మద్దతు ఇద్దాం అంటూ ఇన్ని రోజులు చెబుతున్న నాయకులు మంగళవారం ఒక్క సారిగా వెనక్కి తగ్గిపోయారు. ఎవరైనా మీడియా ప్రతినిధులు సార్ ఏం జరుగుతోంది అంటే అబ్బే ఏమీ లేదు అంటూ చిన్నగా అక్కడి నుంచి జారుకుంటున్నారు.

చిన్నమ్మ శశికళ ముఖంలో చిరునవ్వు మాయం కావడంతో ఆమె అనుచరులకు ఇప్పుడు దడ పుట్టుకుంది. ఎలాగైనా పన్నీర్ సెల్వం పదవి కాపాడుకుంటాం అని ఆయన వర్గీయులు అంటున్నారు. రెండు రోజుల్లో పరిస్థితి పూర్తిగా తారుమారు అయినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
After more than a week of mild speculation as to who would take over the reins of the party, with even Tamil Nadu Chief Minister O Panneerselvam strongly backing Sasikala, it looks like the party has taken a final decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X