వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీన్ రివర్స్: శశికళకు చుక్కలు చూపిస్తున్న అనుచరులు !

శశికళకు ఆమె అనుచరులు ఝలక్ ఇవ్వడంతో చిన్నమ్మకు దిమ్మతిరిగింది. నిన్నటి వరకు చిన్నమ్మ చిన్నమ్మ అంటూ చుట్టూ తిరుగుతున్న ముఖ్య అనుచరులు ఇప్పుడు మద్దతు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారా ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న చిన్నమ్మ నెచ్చెలి శశికళకు అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరూ అనుకూలంగా ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో శశికళ అయోమయంలో పడిపోయారని సమాచారం.

నిన్నటి వరకు చిన్నమ్మ చిన్నమ్మ అంటూ చుట్టూ తిరుగుతున్న ముఖ్య అనుచరులు ఇప్పుడు మద్దతు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారా ? అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు సైతం ఆమెకు దక్కకుండా ప్రయత్నిస్తున్నారా ? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.

రూ. 180 కోట్ల బ్లాక్ మనీ: పన్నీర్, శశికళకు సీబీఐ చిక్కులు !

వివాదాలకు దూరంగా ఉంటు తనపని తాను చేసుకుని వెలుతున్న పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కుర్చోబెట్టాలని ఓ వర్గం ప్రయత్నించడంతో ఇప్పుడు చిన్నమ్మ వర్గీయుల్లో దడపుట్టుకుంది.

Sasikala family over capturing the high post of AIADMK

సోమవారం పోయెస్ గార్డెన్ లో ఉన్న పోలీసులను ఒక్క సారిగా తొలగించడంతో శశికళతో పాటు ఆమె వర్గీయులను కలవరపాటుకు గురి చేసింది. శశికళకు ఇప్పుడు ఎదురైన ప్రతికూల పరిస్థితులు 29వ తేదిన జరగబోయే అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రతిబింబించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

శశికళ ఎవరు ? పోయెస్ గార్గెన్ లో ఎందుకు పోలీసులు: స్టాలిన్

ఇదే జరిగితే శశికళ అనుచరులు ఇప్పటి వరకు పెట్టుకున్న ఆశలు ఒక్క సారిగా ఆవిరైపోతుంది. అలా జరగకుండా చూడటానికి శశికళ అనుచరులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. నాయకులు, శాసన సభ్యులు చెయ్యిజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మొత్తం మీద శశికళలో ఆందోళన మొదలైయ్యిందని ఆమెకు ఇంత వరకు అనుకూలంగా ఉన్న అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. రెండు రోజుల్లో శశికళ భవిష్యత్తు ఏమిటి ? అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుందని అన్నాడీఎంకే కార్యకర్తలు అంటున్నారు.

English summary
The infight of Sasikala family over capturing the high post of AIADMK and Govt of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X