పెరోల్ కోసం అర్జీ పెట్టుకున్న శశికళ, వెంటిలేటర్ మీద లేచి కుర్చున్న చిన్నమ్మ భర్త నటరాజన్ !

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూడటానికి పెరోల్ ఇవ్వాలని కోర్టును.

బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూడటానికి పెరోల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు.

శశికళ తన భర్తను చూడటానికి కచ్చితంగా పెరోల్ మీద బయటకు వస్తారాని ఆమె వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న నటరాజన్ మంగళవారం ఒక్క సారిగా లేచి కుర్చున్నారు.

Sasikala have applied parole to meet her husband Natarajan.

శశికళ పెరోల్ కు అర్జీ సమర్పించిన సమయంలోనే గత 20 రోజుల నుంచి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆమె భర్త నటరాజన్ ఆరోగ్యం మెరుగుపడిందని సమాచారం. లివర్, కిడ్నీలు తదితర అవయవాలు పాడైపోవడంతో నటరాజన్ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.

తన భర్తను చూడటానికి అవకాశం ఇవ్వాలని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ అర్జీ సమర్పించారు. శశికళ కచ్చితంగా జైలు నుంచి పెరోల్ మీద బయటకు వస్తారని టీటీవీ దినకరన్ అంటున్నారు. శశికళ ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారా అంటూ ఆమె బంధువులు, అనుచరులు ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+