శశికళకు షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్, అసలు విషయం తెలిసింది, మన్నార్ గుడి కథ క్లోజ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమాకాన్ని తాము ఇంకా అంగీకరించలేదని భారత ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పడంతో చిన్నమ్మ వర్గంలో టెన్షన్ మొదలైయ్యింది. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు మావే అంటూ ఇంత కాలం విర్రవీగిన మన్నార్ గుడి మాఫియా ఇప్పుడు అయోమయంలో పడింది.

టీటీవీ దినకరన్ ఔట్: ఢిల్లీ వెళ్లిన సీఎం పళనిసామి, శుభకార్యంలో, బీజేపీ పెద్దలతో !

పన్నీర్ సెల్వం వర్గం (అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ) నాయకులు అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమాకాన్ని మీరు అంగీకరిస్తున్నారా ? అంటూ సమాచార హక్కు చట్టం కింద ఎన్నికల కమిషన్ కు అర్జీ సమర్పించింది. అర్జీని పరిశీలించిన ఎన్నికల కమిషన్ స్పంధించింది.

Sasikala is not yet recognized as AIADMK General Secretary, said Election Commission.

ఎన్నికల కమిషన్ సమాధానం ఇస్తూ తాము ఇంకా శశికళ నియమాకాన్ని మేము అంగీకరించలేదని, పరిశీలనలోనే ఉందని సమాధానం ఇవ్వడంతో శశికళ వర్గం ఉలిక్కిపడింది. గురువారం టీటీవీ దినకరన్ ను అన్నాడీఎంపీ పార్టీ నుంచి బహిష్కరించిన ఎడప్పాడి పళనిసామి మరో షాక్ ఇచ్చారు.

నాతో పెట్టుకోవద్దు, సీఎం పళనిసామికి వార్నింగ్ ఇచ్చిన శశికళ అక్క కొడుకు, పదవిలో ఉండవు !

మొత్తం మీద శశికళ ఫ్యామిలీకి చుక్కలు చూపించడంతో మన్నార్ గుడి మాఫియా హడలిపోయింది. ఇప్పుడు శశికళ, దినకరన్ పదవులు కాపాడుకోవడానికి మన్నార్ గుడి మాఫియా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. అయితే వారి ఎత్తుగడలు చిత్తు చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం సిద్దం అయ్యింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
VK Sasikala Natarajan is not yet recognized as AIADMK General Secretary, said Election Commission.
Please Wait while comments are loading...