జయ సమాధివద్ద ఎమ్మెల్యేల లేఖ, శశికళ భావోద్వేగం: 'చిన్నమ్మకి ఎదురు తిరిగితే దాడి'
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తొలుత జయలలిత సమాధి వద్దకు వెళ్లి, అక్కడ నివాళులు అర్పించిన అనంతరం ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలవనున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జయలలిత సమాధి నివాళులు అర్పించారు. వందలాది మంది మద్దతుదారులతో ఆమె సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల లేఖను శశికళ సమాధి వద్ద ఉంచారు. అనంతరం గవర్నర్‌ను కలిసేందుకు రాజ్ భవన్ బయలుదేరారు.
ఎదురు తిరిగితే శశికళ వర్గం దాడి
అన్నాడఎంకే ఎమ్మెల్యేలు, పార్టీ మద్దతు పన్నీరు సెల్వంకే ఉందని కోయంబత్తూరు మేయర్ గురువారం నాడు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పన్నీరు వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేలను బందించారని, శశికళకు నో చెప్పి, ఎదురు తిరుగుతున్న ఎమ్మెల్యేల పైన శశికళ వర్గం దాడి చేస్తోందని పన్నీరు వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది.
ఆ ఇమేజ్ పన్నీరు సెల్వంకు కలిసి వస్తుందా?
ప్రస్తుత పరిణామాలు పన్నీరు సెల్వంకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. శశికళకు గ్రౌండ్ లెవల్లో ఏ మాత్రం మద్దతు లేదు. జయలలిత నిలబెడ్డిన మనిషి అన్న ఇమేజ్ పన్నీరుకు అండగా కనిపిస్తోంది.
ఏ మాత్రం అవకాశం వచ్చినా అంకెల సంకెళ్లు తెగిపోనున్నాయి. ఇప్పటికే శశికళ వైపు నుంచి పలువురు ఎమ్మెల్యేలు పన్నీరు వర్గంలోకి వస్తున్నారు. తమిళనాడు పరిస్థితి పైన ఢిల్లీలో కూడా రాజకీయ వేడి రాజుకుంది. సుమారు 25 మంది అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రణబ్ ముఖర్జీని కలిసి వివరించనున్నారు.
#WATCH: #Sasikala pays tribute at Jayalalithaa's memorial at Chennai's Marina Beach, brings with her letter of support claiming majority pic.twitter.com/Lndz82OJCN
— ANI (@ANI_news) February 9, 2017












Click it and Unblock the Notifications