శశికళ తరలించిన ఎమ్మెల్యేలంతా ఆ రిసార్ట్‌లో.. రాత్రంతా విందు, వినోదం..
ఆ ఎమ్మెల్యేలందరికి లగ్జరి రిసార్ట్ లో బస ఏర్పాటు చేశారని తెలుస్తోంది.హీటెక్కుతోన్న తమిళ పాలిటిక్స్ ను పక్కనబెట్టి, సెల్ ఫోన్లను పక్కన పడేసి.. విందులు,వినోదాలతో వారంతా ఎంజాయ్ చేసినట్టుగా సమాచారం.
చెన్నై: అన్నాడీఎంకె రాజకీయాల్లో ఉత్కంఠకు ఇంకా తెరపడట్లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి తరలించి.. తన పట్టును నిలుపుకునేందుకు శశికళ ప్రయత్నిస్తుండగా.. క్యాంపు రాజకీయాలకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం శశికళను సవాల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే శశికళ తరలించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎమ్మెల్యేలందరిని ఓ రిసార్ట్ కు చేర్చిన శశికళ.. అక్కడ వారందరికీ సకల సౌకర్యాలతో రాజభోగాలు అనుభవించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పుకుంటున్నారు.
పన్నీర్ తిరుగుబాటుతో ఎక్కడ ఎమ్మెల్యేల పట్టు జారిపోతుందోనన్న అభద్రత భావంలో ఉన్నారు శశికళ. ఇందుకోసం ఆమె ఎమ్మెల్యేలకు ప్రత్యేక తాయిలాలు కూడా ప్రకటించినట్టు చెప్పుకుంటున్నారు. కాగా, బుధవారం సాయంత్రం తనకు మద్దతు నిలిచిన 130మంది ఎమ్మెల్యేలను శశికళ ప్రత్యేక బస్సుల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే.

ఆ ఎమ్మెల్యేలందరికి లగ్జరి రిసార్ట్ లో బస ఏర్పాటు చేశారని తెలుస్తోంది.హీటెక్కుతోన్న తమిళ పాలిటిక్స్ ను పక్కనబెట్టి, సెల్ ఫోన్లను పక్కన పడేసి.. విందులు,వినోదాలతో వారంతా ఎంజాయ్ చేసినట్టుగా సమాచారం.
అయితే వారిని ఎక్కడకు తరలించారన్న విషయంపై మీడియా 'క్లూ' సంపాదించింది. చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురానికి ఎమ్మెల్యేలందరిన తరలించినట్టుగా మీడియా చెబుతోంది. గోల్డెన్ బే అనే రిసార్ట్ లో పసందైన విందు, మసాజులతో పాటు వాటర్ స్కైయింగ్ వంటి సౌకర్యాలు ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేశారట.
రిసార్ట్ కు తరలించిన ఎమ్మెల్యేల్లో ఎస్పీ షణ్ముగనాథన్ అనే ఎమ్మెల్యే మధ్యలోనే జారుకున్నట్టు తెలుస్తోంది. బాత్రూమ్ కు వెళ్తున్న అని చెప్పి వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి రాలేదట. కాగా, ఈ రిసార్ట్ వద్ద సీఎం క్యాంప్ ఆఫీస్ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications