తమిళనాడులో ఉప ఎన్నికలు: బరిలో శశికళ ?
చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరిలో నాలుగు శాసన సభ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్దం చేసింది. వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
తమిళనాడులో మొత్తం 234 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. తంజావూరు, కరూరు జిల్లా అరవకురిచ్చి నియోజక వర్గాల్లో విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంపిణి చేశారని ఆరోపిస్తూ డీఎంకే పిటిషన్ వెయ్యడంతో ఆ రెండు నియోజక వర్గాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
మదురై జిల్లా తిరుప్పరగున్రం శాసన సభ్యుడు (అన్నాడీఎంకే) అనారోగ్యంతో మరణించడంతో ఆ నియోజక వర్గం ఖాళీ అయ్యింది. దీంతో మొత్తం మూడు నియోజక వర్గాలు ఖాళీగా ఉన్నాయి. ఆరు నెలల్లో మూడు నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరగవలసి ఉంది.

ప్రస్తుతం ఐదో నెల పూర్తికానున్న నేపధ్యంలో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. వచ్చే వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని అధికారులు అంటున్నారు.
జయ ప్రాణ స్నేహితురాలు శశికళ పోటీ ?
తమిళనాడు ముఖ్యమంత్రి ప్రాణస్నేహితురాలు శశికళ నటరాజన్ తంజావూరు నియెజక వర్గం నుంచి పోటీ చేస్తారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. తంజావూరులో ఏఐఏడీఎంకేకి ఎక్కువ బలం ఉందని.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆశిస్సులతో శశికళ నటరాజన్ తంజావూరు నుంచి అన్నాడీఎంకే పార్టీ గుర్తుతో పోటీ చేస్తారని అంటున్నారు. అయితే జయలలిత ముందు ప్రకటించిన నాయకులను బరిలో దించుతారా ? కొత్త వారికి అవకాశం ఇస్తారా ? అనే విషయం వేచి చూడాలి.












Click it and Unblock the Notifications