శశికళ భర్త నటరాజన్ రీ-ఎంట్రీ: కీలకంగా మారబోతున్నారా!
అప్పట్లో పార్టీ వ్యవహారాల్లో నటరాజన్ జోక్యం నచ్చక ఆయన్ను దూరం పెట్టారు జయలలిత. అయితే ఆమె మరణం తర్వాత పోయెస్ గార్డెన్ లోకి ఆయన రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చెన్నై: తన జీవితం మొత్తంలో అతికొద్దిమందిని మాత్రమే నమ్మిన జయలలిత.. అనుమానం వస్తే ఎవరినైనా పక్కనబెట్టడానికి వెనుకాడలేదు. ఈ క్రమంలోనే ఆమె నెచ్చెలి శశికళ కొన్నాళ్ల పాటు దూరమయ్యారు. ఆ తర్వాత జయనే మళ్లీ శశికళను దరికి చేర్చుకోవడం.. చివరాఖరికి శశికళ చేతుల మీదుగానే ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగిపోయాయి.
కాగా, అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకె రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటూ కొన్ని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అందులో శశికళ భర్త ఎం.నటరాజన్ రీఎంట్రీ ఒకటి. జయలలిత చాన్నాళ్లుగా ఆయన్ను దూరం పెడుతూ వస్తుండగా.. మంగళవారం నాటి అంత్యక్రియల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

దీంతో చాలా రోజుల తర్వాత నటరాజన పోయెస్ గార్డెన్ లో అడుగుపెట్టారు. రాజాజీ హాలులో జయకుఅంజలి ఘటించడంతో పాటు అంత్యక్రియలకు హాజరయ్యారు. అప్పట్లో పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం నచ్చకనే జయ ఆయన్ను దూరం పెట్టారన్న వాదనలున్నాయి.
మొత్తానికి జయ మరణం తర్వాత అన్నాడీఎంకె రాజకీయాలు ఏ మలుపు తీసుకోబోతాయో అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో.. పోయెస్ గార్డెన్ లోకి నటరాజన్ ఎంట్రీ కాకతాళీయంగానే మిగిలిపోతుందా? లేక కీలకంగా మారే అవకాశముందా? అన్నది వేచి చూడాలి.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications