నరేంద్ర మోడీ మద్దతు కోరిన నెచ్చెలి శశికళ, ఎందుకంటే !
మెడికల్ కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ విషయంలో అన్నాడీఎంకే పార్టీ చీఫ్ శశికళ నటరాజన్ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు కోరారు. జాతీయ అర్హత ప్రవేశ పరిక్ష (నీట్) నుంచి తమిళనాడును మినహాయించాలని శశికళ.
చెన్నై: మెడికల్ కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ విషయంలో అన్నాడీఎంకే పార్టీ చీఫ్ శశికళ నటరాజన్ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు కోరారు. జాతీయ అర్హత ప్రవేశ పరిక్ష (నీట్) నుంచి తమిళనాడును మినహాయించాలని శశికళ ప్రధానిని కోరారు.
నీట్ విషయంలో తమిళనాడును మినహాయించాలని మనవి చేస్తూ శశికళ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించే విషయంలో మీ మద్దతు కోరుతున్నాము, మీరు మద్దతు తెలిపితే వైద్య అభ్యర్థులు మీకు ఎంతగానో రుణపడి ఉంటారని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

నీట్ పరిక్ష వల్ల తమిళనాడు వైద్య విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని, అందుకే ఈ విషయంలో రాష్ట్ర అసెంబ్లీ రెండు బిల్లులు కూడా ఆమోదించిందని శశికళ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన నీట్ విషయంలో మీరు మాకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని లేఖలో ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేశారు.
రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకే నీట్ నుంచి తమిళనాడును తప్పించాలని, గతంలో అమ్మ జయలలిత ఈ విషయంలో గట్టిగా పట్టుబట్టారని శశికళ గుర్తు చేశారు. రాష్ట్రంలోని పేద విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకే అసెంబ్లీలో బిల్లులు ఆమోదించామని శశికళ తను రాసిన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications