వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైడ్రామా: దాడి తర్వాత.. శశికళ పుష్ప భర్త మిస్సింగ్, పోలీసులదే బాధ్యత

అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ కనిపించడం లేదు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ కనిపించడం లేదు! బుధవారం మధ్యాహ్నం అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ఎదుట పుష్ప భర్త, లాయర్ పైన అన్నాడీఎంకే కార్యకర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

అంతా రివర్స్, శశికళకు ఓటమి భయమా?: రెచ్చిపోయి.. పుష్ప భర్తపై దాడి వెనుక!అంతా రివర్స్, శశికళకు ఓటమి భయమా?: రెచ్చిపోయి.. పుష్ప భర్తపై దాడి వెనుక!

జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకే పార్టీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత ఎక్కువ మంది నేతలు శశికళకు మద్దతు పలికారు. ఆ తర్వాత క్రమంగా కొందరు ఆమెకు దూరం జరుగుతున్నారు.

sasikala pushpa

మరోవైపు, శశికళ పుష్ప వంటి వారు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. శశికళ పార్టీ అధినేత్రి కాకుండా చేయాలని శశికళ పుష్ప తాను కూడా రేపు (గురువారం) జరగబోయే పార్టీ ప్రధాన కార్యదర్శి బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త, లాయర్ పైన దాడి జరిగింది.

దాడి అనంతరం శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ కనిపించడం లేదు. తన భర్త కనిపించడం లేదని పుష్ప కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. తన భర్తకు ఏమైనా పోలీసులదే బాధ్యత అన్నారు. మరోవైపు, శశికళ పుష్ప తరఫు లాయర్ మాట్లాడుతూ.. లింగేశ్వరన్ ఎక్కడ ఉన్నారో పోలీసులు చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు.

జయలలిత మృతి: శశికళ గురించి వెలుగు చూసిన షాకింగ్, ఏం చేయాలి?జయలలిత మృతి: శశికళ గురించి వెలుగు చూసిన షాకింగ్, ఏం చేయాలి?

ఎంపీ శశికళ పుష్ప లాయర్లపై ఆ పార్టీ నేతలు బుధవారం దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శశికళకు సంబంధించి లేఖను ఇచ్చేందుకు పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన నలుగురు లాయర్ల బృందంపై కార్యకర్తలు దాడికి దిగారు.

వారిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. జయలలిత మృతికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని, దానికి సంబంధించి అపోలో ఆసుపత్రిలో ఏమి జరిగిందో తెలపాలని శశికళ కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై విచారణ చేపట్టాలని ఆమె కోర్టులో పిటిషన్‌ వేశారు.

English summary
Pushpa has filed a missing person complaint with the Commissioner of Police but her lawyer claims that the police is not divulging the information about Lingerswaran's whereabouts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X