పన్నీరుకు షాక్: మధుసూదనన్‌పై శశికళ వేటు, వారే బెదిరిస్తున్నారని..

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ శుక్రవారం నాడు ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ పైన వేటు వేశారు. ఆయనను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత సెంగొట్టాయన్‌కు ఆ పదవి అప్పగించారు

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ శుక్రవారం నాడు ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ పైన వేటు వేశారు. ఆయనను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత సెంగొట్టాయన్‌కు ఆ పదవి అప్పగించారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందును ఆయన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శశికళ ప్రకటించారు. అయితే, తనను పదవి నుంచి తప్పించడాన్ని ఆయన ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.

ఎంజీఆర్ సమయం నుంచి మధుసూదనన్ పార్టీలో కీలక నేత. అలాంటి నాయకుడిని శశికళ.. ప్రధాన కార్యదర్శి హోదాలో తొలగించింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. ఇది పార్టీలో మరింత కలకలం రేపేలా కనిపిస్తోంది.

మేం ఎవర్నీ కిడ్నాప్ చేయలేదు: సరస్వతి, శశికళ వర్గం

ఎమ్మెల్యేలను నిర్బంధించారంటూ వస్తున్న వార్తలు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలపై శశికళ వర్గం అప్రమత్తమైంది. అయిదుగురు ఎమ్మెల్యేలను రిసార్ట్స్ బయటికి పంపించి మీడియాతో మాట్లాడించింది. తమను ఎవరూ నిర్బంధించలేదనీ, స్వేచ్ఛగా బయటికి లోపలికి తిరుగుతున్నామని శశికళ శిబిరంలోని ఎమ్మెల్యే రామ జయలింగం వెల్లడించారు.

Sasikala removes Madhusudhanan as AIADMK presidium chairman

గోల్డెన్ బే రిసార్ట్స్‌లో ఎన్నాళ్లు ఉంటామో తెలియదనీ, తమిళనాడు రాజకీయ అనిశ్చితిపై గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేలు ఎవరూ నిరాహార దీక్ష చేయడంలేదనీ, అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు.

తాము ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయలేదని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు. పన్నీరు సెల్వం వర్గీయులే తమను బెదిరించారని చెప్పారు. శశికళే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, ఆమె ముఖ్యమంత్రి అవుతారన్నారు. గవర్నర్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+