Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జయ మృతి: ఇంటర్వ్యూ లో నోరు విప్పిన శశికళ, నిజం చెప్పేసి ?

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మొదటి సారి మీడియా ముందు నోరువిప్పారు. జయలలిత గురించి పూర్తి వివరాలు మొత్తం ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో నెచ్చెలి శశికళ నటరాజన్ చెప్పేశారంట.

జయలలితతో ఎలా పరిచయం అయ్యింది ? తరువాత స్నేహం ఎలా అనుబంధంగా మారింది ? మద్యలో వచ్చిన సమస్యలు ఏమిటి ? తన సోదరుడి కుమారుడిని జయలలిత ఎందుకు దత్తత తీసుకున్నారు ? తరువాత ఎందుకు అతన్ని దూరం చేశారు ? అని నెచ్చెలి శశికళ ఇంటర్వూలో చెప్పారంట.

ప్రముఖుల మనసులోని అన్ని వివరాల గురించి ప్రపంచానికి చాటి చెబుతున్న 'Provoke LifeStyle Magazine' అనే పత్రికకు నెచ్చెలి శశికళ మొదటి సారి ఇంటర్వూ ఇచ్చారు. ఆ పత్రిక 2017 జనవరి మొదటి వారంలో విడుదల అవుతున్నది.

శశికళ ఇచ్చిన ఇంటర్వూలో జయలలిత ఆసుపత్రిలో చేరిన్నప్పటి నుంచి ఏం జరిగింది ? చికిత్స ఎలా చేశారు ? ఆమ్మ అనారోగ్యానికి అసలుకారణాలు ఏమిటి ? అని శశికళ పూర్తిగా వివరించారని నెచ్చెలి సన్నిహితులు అంటున్నారు.

Sasikala's first interview to be published by Provoke LifeStyle Magazine

శశికళ ఇచ్చిన ఇంటర్వూ వివరాలు బయటకు వస్తే జయలలిత ఎలా మృతి చెందారు అని ఇప్పటి వరకు ప్రజలలో ఉన్న అనుమానాలు కొంతవరకైనా తొలుగుతాయని అమ్మ అభిమానులు అంటున్నారు.

ఎప్పుడు ఆ పత్రిక బయటకు వస్తుందా ? అని అమ్మ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో జయలలిత తన ఆస్తులకు ఎవరు వారసులు ? రాజకీయ వారసులు ఎవరు ? అమ్మ వీలునామాలో ఏమి ఉంది ? అనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

అయితే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలతో పాటు సీఎం కుర్చి కావాలని ఆశగా ఎదురు చూస్తున్న శశికళ అసలు విషయాలు బయటకు చెప్పారా ? లేదా ? అనే అనుమానాలు ఉన్నాయని ఆమె వ్యతిరేక వర్గం నాయకులు అంటున్నారు.

మొత్తం మీద శశికళ మొదటి సారి నోరు తెరచి మీడియాకు ఇంచిన ఇంటర్వూలో ఏమి చెప్పారు ? అని తమిళనాడు ప్రజలతో పాటు దేశం మొత్తంగా ఉన్న అమ్మ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ పత్రిక బయటకు వస్తే హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+